నిజామాబాద్ : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రభుత్వ విద్యాసంస్థలు, యూనివర్సిటీల పర్యటన బాసర ట్రిపుల్ ఐటీ సందర్శనతో ప్రారంభమయ్యింది. ఇవాళ బాసర పర్యటన కోసం రైల్లోనే హైదరాబాద్ నుండి నిజామాబాద్ కు చేరుకున్నారు గవర్నర్. నిజామాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న గవర్నర్ కు పోలీస్ ఉన్నతాధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు స్వాగతం పలికారు. అక్కడినుండి రోడ్డుమార్గంలో బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కు చేరుకున్నారు గవర్నర్ తమిళిసై.