హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం రాజధాని హైదరాబాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. బంజారాహిల్స్ లో భారీ వ్యయంతో నిర్మించిన ఈ అద్దాల మేడ ప్రారంభోత్సవానికి సిద్దమయ్యింది. రాత్రి సమయంలో ఈ భవనం విద్యుత్ దీపాలతో వెలుగుతూ జిగేల్ మంటోంది. ఏడెకరాల విస్తీర్ణంలో ప్రపంచస్థాయి ఇంజనీరింగ్ టెక్నాలజీతో, అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నేడు (గురువారం) ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభంకానుంది.