Free Sewing Machine : తెలంగాణలో చాలామంది మహిళలు ఇంట్లో వుంటూనే కుటుంబ అవసరాల కోసం డబ్బులు సంపాదిస్తుంటారు. ఇందుకోసం చాలా పనులు వున్నాయి... బీడీలు చుట్టడం నుండి బట్టలు కుట్టడం వరకు ఎన్నో చేస్తుంటారు. ఇలా స్వయం ఉపాధి ద్వారా కుటుంబానికి ఆర్థికంగా అండగా వుండాలని ఇంకా చాలామంది మహిళలు కోరుకుంటారు. అలాంటి నిరుపేద మైనారిటీ వర్గాల మహిళలకు తెలంగాణ ప్రభుత్వం సాయానికి ముందుకొచ్చింది.
మైనారిటీ అంటే ముస్లిం, సిక్కు,బౌద్ద,జైన, పార్సీ వర్గాలకు చెందిన మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఇందిరమ్మ మహిళా శక్తి పథకంలో భాగంగా మైనారిటీ వర్గాల్లోని పేదింటి ఆడబిడ్డకు పూర్తి ఉచితంగా కుట్టు మిషన్లు అందిస్తోంది. తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఇప్పటికే అర్హులైన మహిళల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మీరు కూడా మైనారిటీ వర్గానికి చెందినవారై, ఈ కింద పేర్కొన్న అర్హుతలు కలిగివుంటే వెంటనే దరఖాస్తు చేసుకొండి.