యువతకు గుడ్ న్యూస్ ... తెలంగాణ ఆర్టిసిలో భారీ ఉద్యోగాల భర్తీ, ఎన్నో తెలుసా?

First Published | Dec 18, 2024, 1:56 PM IST

తెలంగాణ ప్రభుత్వం మరో భారీ ఉద్యోగ భర్తీ ప్రకటనకు సిద్దమైంది. అసెంబ్లీ సాక్షిగా స్వయంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేసారు. 

Telangana RTC Jobs

Telangana RTC Jobs : తెలంగాణ నిరుద్యోగ యువతకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్. ఇటీవల ఉద్యోగ నియామకాలపై ప్రత్యేక దృష్టి పెట్టినవిషయం తెలిసిందే... స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగాలు పొందినవారికి నియామక పత్రాలు అందించడం చూసాం. ఇక గ్రూప్ 3, గ్రూప్ 2 వంటి పోటీ పరీక్షలు కూడా నిర్వహించారు.. నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఇలా జోరుగా ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతున్నవేళ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేసారు. త్వరలోనే తెలంగాణ ఆర్టిసిలో భారీ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు ప్రకటించారు. 
 

Telangana RTC Jobs

తెలంగాణ ఆర్టిసిలో ఉద్యోగాల జాతర : 

తెలంగాణ మహిళలకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది రేవంత్ సర్కార్. ఎన్నికల వేళ ఇచ్చిన ఈ హామీని అధికారంలోకి రాగానే అమలు చేసారు. దీంతో ఆర్టిసి బస్సులకు డిమాండ్ పెరిగింది...మహిళలు ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించడమే మానేసారు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత బస్సులు మహిళలతో  కిక్కిరిసిపోతున్నాయి. 

ఆర్టిసి బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య అమాంతం పెరిగింది... గతంలో కేవలం 50శాతంగా వుండే ఆక్యుపెన్సీ ప్రస్తుతం 100 శాతంగా వుంటోంది. అందువల్లే అవసరానికి సరిపడా బస్సులను నడపలేకపోతోంది ఆర్టిసి. దీంతో బస్సుల కొరత ఏర్పడి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయాన్ని పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. 

ఎమ్మెల్యేల ప్రశ్నకు సమాధానంగా రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే ప్రయాణికుల సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు ముమ్మరం చేసామని... అందుకోసమే ఆర్టిసిలో ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించామన్నారు. తెలంగాణ ఆర్టిసిలో కొత్తగా 3,039 ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు అసెంబ్లీ సాక్షిగా మంత్రి చేసిన ప్రకటన నిరుద్యోగ యువతను ఫుల్ ఖుషీ చేసింది. 
 


Telangana RTC Jobs

TGSRTC పై రేవంత్ సర్కార్ ఫోకస్ 

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత ఆర్టిసి విభజన జరిగిందని... ఈ క్రమంలోనే తెలంగాణలో 55,000 కు పైగా ఉద్యోగులు వుండేవారని మంత్రి పొన్నం తెలిపారు. కానీ గత పదేళ్లలో దాదాపు 15 వేలమంది ఉద్యోగ విరమణ పొందారని... కానీ గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేపట్టలేదని తెలిపారు. అందువల్లే ప్రస్తుతం టిజిఎస్ ఆర్టిసిలో 40వేల మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారని మంత్రి వెల్లడించారు. 

మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని ... దీంతో ప్రజలంతా బస్సుల్లో ప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గతంలో మాదిరిగానే బస్సులు నడుపుతున్నాం... కానీ ప్రయాణికులు పెరగడంతో అవి సరిపోవడంలేదన్నారు. కాబట్టి కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం సిద్దమయ్యింది... ఇందులో భాగంగానే ఆర్టిసిలో ఉద్యోగాల భర్తీ చేపట్టేందుకు కూడా ప్రయత్నిస్తున్నామని మంత్రి స్పష్టం చేసారు. తెలంగాణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్టిసి బస్సులు,ఉద్యోగుల సంఖ్యను పెంచనున్నట్లు పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. 

ఇక హైదరాబాద్ తో పాటు ప్రధాన పట్టణాలు, జిల్లా కేంద్రాలను అనుసంధానం చేసేలా ఆర్టిసి బస్సులు నడవనున్నాయని... అందుకోసం తగిన ప్రణాళికలు రూపొందించామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలైన ధర్మపురి,వేములవాడ, కొండగట్టులను కలుపుతూ బస్సుల లింకింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఆర్టిసికి పూర్వవైభవం తీసుకువస్తామనేలా స్వయంగా రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ వేదికన ఆసక్తికర ప్రకటనలు చేసారు. 
 

Telangana RTC Jobs

తెలంగాణ ఆర్టిసిలో 1201 డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 

ప్రభుత్వ రంగ సంస్థ తెలంగాణ ఆర్టిసిలో ఇప్పటికే భారీగా డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. కాంట్రాక్ట్ పద్దతిలో అర్హత గల మాజీ సైనికులను డ్రైవర్లుగా నియమించుకునేందుకు ఆర్టిసి సిద్దమయ్యింది. ఇలా ఏకంగా 1201 ఉద్యోగాల భర్తీకి  నోటిఫికేషన్ కూడా విడుదల చేసారు.  

ప్రభుత్వ రంగానికి చెందిన తెలంగాణ రోడ్డు రవాణా సంస్ధ (టిజిఎస్ ఆర్టిసి)లో భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. 1201 డ్రైవర్ పోస్టుల భర్తీకి సిద్దమైన ఆర్టిసి అర్హుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. కాంట్రాక్ట్ పద్దతిలో ఈ డ్రైవర్ నియామకాలను చేపడుతోంది టీజిఎస్ ఆర్టిసి. తెలంగాణ సైనిక సంక్షేమ శాఖ ఆర్టిసితో కలిసి  ఈ డ్రైవర్స్ రిక్రూట్ మెంట్ చేపట్టింది. 58 ఏళ్లలోపు వయసుండి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన మాజీ సైనికులు తెలంగాణ ఆర్టిసిలో ఉద్యోగాన్ని పొందవచ్చు. 

అయితే ఇప్పటికే ఈ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ ముగిసింది... కేవలం నవంబర్ 30 తేదీ వరకు అవకాశం ఇచ్చారు. ఇలా వచ్చిన దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది...  అర్హులైన మాజీ సైనికులకు కోరుకున్న ప్రాంతంలో అవకాశం కల్పిస్తున్నారు. ఇలా తమ స్వస్థలంలోని ఆర్టిసి ఉద్యోగాన్ని పొందే అవకాశం మాజీ సైనికులకు వచ్చింది. 
 
  
 

Latest Videos

click me!