విద్యుత్ ఉద్యోగుల విధుల బహిష్కరణ... ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తున్న ఆ శాఖ కార్యాలయాలు

Published : Aug 08, 2022, 12:48 PM IST

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఇవాళ (సోమవారం) పార్లమెంట్ లో విద్యుత్ చట్టసవరణ బిల్లు ప్రవేశపెట్టడానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు ఆందోళనలు చేపట్టారు. ఇలా తెలంగాణలో కూడా విద్యుత్ ఉద్యోగులు విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. దీంతో విద్యుత్ కార్యాలయాలు ఉద్యోగులు లేక ఖాళీ కుర్చీలతో  దర్శనమిస్తున్నాయి.      

PREV
16
విద్యుత్ ఉద్యోగుల విధుల బహిష్కరణ... ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తున్న ఆ శాఖ కార్యాలయాలు
electricity strike

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ చట్టసవరణ బిల్లు 2022 ని వ్యతిరేకిస్తూ తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు విధులను బహిష్కరించారు. దీంతో విద్యుత్ కార్యాలయాలు ఉద్యోగులు లేక ఖాళీ కుర్చీలతో  దర్శనమిస్తున్నాయి. ఉద్యోగుల ఆందోళనతో విద్యుత్ శాఖ కార్యకలాపాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. 

26
electricity strike

గతకొంత కాలంగా విద్యుత్ చట్టసవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టిన ఉద్యోగులు ఇవాళ మరింత ఉదృతం చేసారు. ఇవాళ పార్లమెంట్ ముందుకు ఈ బిల్లును కేంద్రం తీసుకురానున్న నేపథ్యంతో ఉద్యోగులు దేశవ్యాప్త ఆందోళననకు పిలుపునిచ్చారు. 
 

36
electricity strike

జాతీయస్థాయిలో ఏర్పడిన నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ పిలుపుమేరకు తెలంగాణలో విద్యుత్ ఉద్యోగులు విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. కార్యాలయాలకు వెళ్లకుండా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. 

46
electricity strike

ఇప్పటికయినా విద్యుత్ చట్టసవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు మింట్ కాంపౌండ్ వద్దకు భారీగా చేరుకుని ర్యాలీకి సిద్దమయ్యారు. దీంతో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేసారు. 

56
electricity strike

 కేంద్ర ప్రభుత్వం వెంటనే బిల్లును ఉపసంహరించుకోవాలని...లేదంటే తెలంగాణ బీజేపీ నాయకులు, ఎంపీలు,కేంద్ర మంత్రుల ఇళ్ళకు పవర్ కట్  చేస్తామని విద్యుత్ ఉద్యోగులు హెచ్చరించారు. అలాగే బిల్లు ఆమోదం పొందితే దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతామని ఉద్యోగులు హెచ్చరించారు.  

66
electricity strike

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ విద్యుత్ చట్టసవరణ బిల్లును వ్యతిరేకిస్తోంది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం కూడా చేసింది. ఇలా ఉద్యోగులు, పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్రం విద్యుత్ చట్టసవరణ బిల్లు విషయంలో వెనక్కితగ్గడం లేదు. 

click me!

Recommended Stories