ఆపరేషన్ ఆకర్ష్: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...
పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే నాటికి బలహీనంగా ఉన్న జిల్లాల్లో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఫోకస్ పెట్టింది.
ఆపరేషన్ ఆకర్ష్: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...
2023 నవంబర్ మాసంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడ దక్కలేదు. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ నాయకత్వం చర్యలు చేపట్టింది. హైద్రాబాద్ జిల్లాకు ఇంచార్జీగా ఉన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు.
ఆపరేషన్ ఆకర్ష్: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...
పలువురు బీఆర్ఎస్ నేతలతో పాటు ఇతర పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. హైద్రాబాద్ నగరంలో పార్టీని బలోపేతం చేసే క్రమంలోనే మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అనిల్ కుమార్ కు కాంగ్రెస్ నాయకత్వం రాజ్యసభ టిక్కెట్టు కేటాయించింది.
ఆపరేషన్ ఆకర్ష్: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై మంచి పట్టున్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీతా మహేందర్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్న సునీతా మహేందర్ రెడ్డి పనిచేసిన విషయం తెలిసిందే.
ఆపరేషన్ ఆకర్ష్: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...
ఎన్నికలకు ముందు జరిగిన కేబినెట్ విస్తరణలో పట్నం మహేందర్ రెడ్డికి కేసీఆర్ మంత్రి పదవిని కేటాయించారు. 2014లో కూడ కేసీఆర్ మంత్రివర్గంలో పట్నం మహేందర్ రెడ్డికి మంత్రిపదవి దక్కింది.
ఆపరేషన్ ఆకర్ష్: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...
2009లో మహేశ్వరం అసెంబ్లీ స్థానం నుండి తెలుగు దేశం పార్టీ అభ్యర్ధిగా విజయం సాధించిన తీగల కృష్ణారెడ్డి కూడ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇటీవలనే తీగల కృష్ణారెడ్డి తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత దంపతులు కూడ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. వీరంతా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారు.
ఆపరేషన్ ఆకర్ష్: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...
పార్లమెంట్ ఎన్నికల నాటికి గతంలో బలహీనంగా ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఇతర పార్టీల్లోని అసంతృప్తులకు గాలం వేస్తుంది.
ఆపరేషన్ ఆకర్ష్: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...
పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రం నుండి మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలని ఆ పార్టీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తుంది. రాష్ట్రం నుండి సోనియా గాంధీని పోటీ చేయాలని కూడ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ తీర్మానం చేసింది. అయితే రాజస్థాన్ నుండి సోనియా గాంధీ రాజ్యసభకు ఎన్నికల బరిలో దిగారు.
ఆపరేషన్ ఆకర్ష్: పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ ఇదీ...
సోనియా గాంధీ తెలంగాణ నుండి పోటీ చేస్తే ఆ ప్రభావం రాష్ట్రంపై ఉంటుందని కాంగ్రెస్ భావించింది. కానీ రాజ్యసభ ఎన్నికల బరిలో సోనియా గాంధీ దిగింది. అయితే ప్రియాంకగాంధీని రాష్ట్రం నుండి బరిలోకి దింపాలని ఆ పార్టీ భావిస్తుంది. అయితే ఈ విషయమై ప్రియాంక గాంధీ నుండి స్పష్టత రావాల్సి ఉంది.