ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశం:సెంటిమెంట్ జోడింపు,కాంగ్రెస్, బీఆర్ఎస్‌లలో పైచేయి ఎవరిదో?

First Published | Feb 15, 2024, 4:50 PM IST

పార్లమెంట్ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న సమయంలో నీటి ప్రాజెక్టులను  తెలంగాణలో ప్రధాన పార్టీలు తెరమీదికి తెస్తున్నాయి.

ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశం:సెంటిమెంట్ జోడింపు,కాంగ్రెస్, బీఆర్ఎస్‌లలో పైచేయి ఎవరిదో?

పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొచ్చే అవకాశం ఉండడంతో తెలంగాణలో  అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ లు నీటి ప్రాజెక్టుల అంశంపై  మాటల యుద్ధానికి దిగాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ అంశాన్ని ప్రచార అస్త్రంగా మార్చుకొనేందుకు  రెండు పార్టీలు  రంగం సిద్దం చేసుకుంటున్నాయి. అదే సమయంలో  సెంటిమెంట్ ను ఇందుకు  జత చేయనున్నాయి.

ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశం:సెంటిమెంట్ జోడింపు,కాంగ్రెస్, బీఆర్ఎస్‌లలో పైచేయి ఎవరిదో?

నీటి ప్రాజెక్టుల అంశంపై రెండు పార్టీలు  పైచేయి సాధించే ప్రయత్నాలు చేస్తున్నాయి.  ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 
 
ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశం:సెంటిమెంట్ జోడింపు,కాంగ్రెస్, బీఆర్ఎస్‌లలో పైచేయి ఎవరిదో?

2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మూడు పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బీఆర్ఎస్  పార్టీ 9 స్థానాల్లో , బీజేపీ నాలుగు స్థానాల్లో, ఎంఐఎం ఒక్క స్థానంలో గెలుపొందింది.
 
ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశం:సెంటిమెంట్ జోడింపు,కాంగ్రెస్, బీఆర్ఎస్‌లలో పైచేయి ఎవరిదో?

2019 పార్లమెంట్ ఎన్నికలు జరగడానికి  కొన్ని మాసాల ముందే  2018లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో తెలంగాణలో  అప్పట్లో  భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధికారంలోకి వచ్చింది.  2023 నవంబర్ మాసంలో జరిగిన  ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బీఆర్ఎస్ 39 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. 
 
ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశం:సెంటిమెంట్ జోడింపు,కాంగ్రెస్, బీఆర్ఎస్‌లలో పైచేయి ఎవరిదో?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కృష్ణా నదిపై  ఉన్న ప్రాజెక్టులను  కేఆర్ఎంబీకి  అప్పగించారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అయితే  కేఆర్ఎంబీకి  ప్రాజెక్టులను అప్పగించలేదని కాంగ్రెస్ సర్కార్ చెబుతుంది.  తెలంగాణ అసెంబ్లీలో  ఈ విషయమై  తీర్మానం కూడ చేసింది. ఈ తీర్మానానికి  అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి.

ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశం:సెంటిమెంట్ జోడింపు,కాంగ్రెస్, బీఆర్ఎస్‌లలో పైచేయి ఎవరిదో?

కృష్ణా నదిపై ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగిస్తే రాష్ట్రానికి నష్టమని  బీఆర్ఎస్ వాదిస్తుంది. అయితే  కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను గత ప్రభుత్వమే  కేటాయించిందని  అసెంబ్లీలోనే  తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశం:సెంటిమెంట్ జోడింపు,కాంగ్రెస్, బీఆర్ఎస్‌లలో పైచేయి ఎవరిదో?

కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి కాంగ్రెస్ సర్కార్ అప్పగించడాన్ని నిరసిస్తూ  నల్గొండ వేదికగా  రెండు రోజుల క్రితం  బీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించింది. రాష్ట్రానికి నీటి కేటాయింపుల విషయంలో  అన్యాయం చేస్తే ఊరుకోబోమని కేంద్రానికి కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సభలో  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కూడ కేసీఆర్ మండిపడ్డారు. 

ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశం:సెంటిమెంట్ జోడింపు,కాంగ్రెస్, బీఆర్ఎస్‌లలో పైచేయి ఎవరిదో?

ఎన్నికలకు ముందే  కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత  కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది

ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశం:సెంటిమెంట్ జోడింపు,కాంగ్రెస్, బీఆర్ఎస్‌లలో పైచేయి ఎవరిదో?

మేడిగడ్డ బ్యారేజీపై  సిట్టింగ్ జడ్జి విచారణకు  ఆదేశాలు జారీ చేసింది.  అయితే  జడ్జిల కొరత ఉన్నందున  రిటైర్డ్ జడ్జిని విచారణకు తీసుకోవాలని  హైకోర్టు చీఫ్ జస్టిస్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. దీంతో  రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై ఏం చేయాలనే దానిపై ఆలోచిస్తుంది.

ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశం:సెంటిమెంట్ జోడింపు,కాంగ్రెస్, బీఆర్ఎస్‌లలో పైచేయి ఎవరిదో?

మరో వైపు మేడిగడ్డ బ్యారేజీ విషయంలో  విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  విజిలెన్స్ మధ్యంతర నివేదిక ప్రభుత్వానికి చేరింది.  రెండు రోజుల క్రితం ఎమ్మెల్యేలను మేడిగడ్డకు  ప్రభుత్వం తీసుకెళ్లింది. బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ టూర్ కు దూరంగా ఉన్నారు.

ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశం:సెంటిమెంట్ జోడింపు,కాంగ్రెస్, బీఆర్ఎస్‌లలో పైచేయి ఎవరిదో?

గత ఏడాది నైరుతి రుతుపవనాల ప్రారంభంలో  కృష్ణా పరివాహక ప్రాంతంలో  ఆశించినంతగా వర్షాలు కురవలేదు. దరిమిలా  శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు నీరు చేరలేదు.  కేఆర్ఎంబీకి  ప్రాజెక్టులను అప్పగిస్తే  బోర్డు చెప్పినట్టే వినాల్సిన పరిస్థితి నెలకొంటుందని  బీఆర్ఎస్ వాదిస్తుంది. అదే జరిగితే  రాష్ట్రానికి నష్టమని  ఆ పార్టీ చెబుతుంది. కేఆర్ఎంబీకి  ప్రాజెక్టులను అప్పగించినట్టుగా  బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని  నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  స్పష్టం చేశారు.

ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశం:సెంటిమెంట్ జోడింపు,కాంగ్రెస్, బీఆర్ఎస్‌లలో పైచేయి ఎవరిదో?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  బీఆర్ఎస్ ఓటమి పాలైంది. పార్లమెంట్ ఎన్నికల్లో  మెరుగైన సీట్లను దక్కించుకోవాలని ఆ పార్టీ భావిస్తుంది.  ఈ క్రమంలోనే  ప్రాజెక్టుల అంశాన్ని బీఆర్ఎస్ తెరమీదికి తెచ్చింది.  బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం కోల్పోగానే  కాంగ్రెస్ ప్రభుత్వం నష్టం చేసిందనే ప్రచారం బీఆర్ఎస్ చేస్తుంది. రాజకీయంగా ఈ ప్రచారం గులాబీ పార్టీకి ఏ మేరకు కలిసి వస్తుందోననేది  పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి.

ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశం:సెంటిమెంట్ జోడింపు,కాంగ్రెస్, బీఆర్ఎస్‌లలో పైచేయి ఎవరిదో?

ఇదిలా ఉంటే  మేడిగడ్డ అంశాన్ని తీసుకొని బీఆర్ఎస్ సర్కార్ ఏం చేసిందనే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో  కేసీఆర్ సర్కార్  ఏం చేసింది, ప్రజా ధనం ఎలా దుర్వినియోగం చేసిందనే అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని  ఆ పార్టీ భావిస్తుంది.

ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశం:సెంటిమెంట్ జోడింపు,కాంగ్రెస్, బీఆర్ఎస్‌లలో పైచేయి ఎవరిదో?

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా  జగన్ సర్కార్ కృష్ణా నీటిని  ఆంధ్రప్రదేశ్ కు తరలించేందుకు చేసిన ప్రయత్నాలను  కేసీఆర్ సర్కార్ అడ్డుకోని విషయాన్ని  కాంగ్రెస్ సర్కార్ తెరమీదికి తెచ్చింది.ఈ విషయమై  ఏపీ అసెంబ్లీలో జగన్ ప్రసంగ వీడియోను కూడ నీటిపారుదల శాఖ మంత్రి  అసెంబ్లీలో ప్రదర్శించారు. నీటిపారుదల ప్రాజెక్టుల అంశంపై  సెంటిమెంట్ ను రగిల్చేందుకు  రెండు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

Latest Videos

click me!