నాగార్జునసాగర్ బైపోల్: కాంగ్రెస్‌కి చావో రేవో, ఆ పార్టీలకు చెక్ పెట్టేనా?

First Published Apr 11, 2021, 4:37 PM IST

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలను మూడుప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. 

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. ఈ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాలని ఆ పార్టీ సర్వశక్తులను ఒడ్డుతోంది.
undefined
ఈ నెల 17వ తేదీన నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి బరిలో దిగారు.
undefined
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత టీఆర్ఎస్., బీజేపీ తమ అభ్యర్ధులను ప్రకటించాయి. ప్రత్యర్ధుల కంటే ముందే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన జానారెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలంతా ఈ నియోజకవర్గంలోనే విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
undefined
గత మాసంలో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకొంది.కానీ నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో తమ సత్తాను చాటాలని ఆ పార్టీ భావిస్తోంది.
undefined
ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుండి (గతంలో చలకుర్తి, ప్రస్తుతం నాగార్జునసాగర్) ఏడు దఫాలు జానారెడ్డి విజయం సాధించారు. రెండు దఫాలు ఓటమి పాలయ్యాడు.మరోసారి తన అధృష్టాన్ని ఆయన పరీక్షించుకోనున్నారు.
undefined
ఇటీవల జరిగిన రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి రాలేదు
undefined
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కూడ చివరి నిమిషంలో బీజేపీ తన అభ్యర్ధిని ప్రకటించింది. దుబ్బాకలో మాదిరిగా నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే ఇది అంతా ఆషామాషీ విషయం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
undefined
రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ చెబుతోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను ఆ పార్టీ నేతలు ఇందుకు ఉదహరణగా చూపేవారు.
undefined
అయితే ఈ రెండు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అతి విశ్వాసంతో వ్యవహరించడం వల్ల కొంత నష్టపోయిందనే అభిప్రాయాలు ఆ పార్టీ నేతలే వ్యక్తం చేస్తున్నారు.
undefined
ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా బీజేపీ, టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. గత నెల 27వ తేదీన హలియాలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభ నిర్వహించింది.
undefined
ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో హలియాలో నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఆ సమయంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాలేదు. అందుకే ఆ సభలో నియోజకవర్గానికి వరాలు కురిపించారు. ఈ నెల 14న హలియాలో నిర్వహించే సభలో కేసీఆర్ పాల్గొంటారు.
undefined
రెండు దఫాలు ఎన్నికల సభలో కేసీఆర్ పాల్గొనడం అంటే టీఆర్ఎస్ ఓటమి నిర్ధారణ అయిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధిస్తే జానారెడ్డి సీఎం అవుతారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం నాడు నాగార్జునసాగర్ లో నిర్వహించిన ప్రచారసభలో ప్రకటించారు
undefined
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం రానుంది. వరుస అపజయాలకు ఈ విజయం తో చెక్ పెట్టినట్టుగా అవుతోంది. అంతేకాదు రాష్ట్రంలో తమకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీని కాంగ్రెస్ నిలువరించామని చెప్పుకోవచ్చు.
undefined
ఈ స్థానంలో ఒకవేళ కాంగ్రెస్ ఓటమిపాలై బీజేపీ రెండో స్థానంలో నిలిస్తే ఆ పార్టీచెప్పుకొంటున్నట్టుగా కాంగ్రెస్ కు తాము ప్రత్యామ్నాయమని ప్రజలు నమ్ముతున్నారని ప్రచారం చేసుకొనేందుకు అవకాశం దక్కనుంది.
undefined
మొత్తంగా నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఫలితాలు రాష్ట్ర రాజకీయ సమీకరణాల్లో తెర తీయనుందా లేదా అనేది ఈ ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి.
undefined
click me!