తల్లీ తమ్ముడితో సహా...కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

First Published | Apr 9, 2021, 5:02 PM IST

తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లీ, సోదరుడితో కలిసి కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. 
 

హైదరాబాద్: తెలంగాణలో ఓవైపు కరోనా వ్యాప్తి కొనసాగుతున్న సమయంలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా సాగుతోంది. కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువ అవుతున్న సమయంలో వ్యాక్సిన్ తీసుకోడానికి ప్రముఖులతో సహా సామాన్యులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అమ్మ శాంతమ్మ తో కలిసి వచ్చి వ్యాక్సిన్ తీసుకున్నారు మంత్రి. వయసు మీదపడిన తల్లికి కూడా వ్యాక్సిన్ వేయించారు.

అంతేకాకుండా మంత్రి సోదరుడు శ్రీకాంత్ గౌడ్ కూడా వ్యాక్సిన్ వేసుకున్నారు. ప్రస్తుతం కోవిడ్ 19 మొదటి డోస్ ను తీసుకున్న వీరు త్వరలో రెండో డోస్ వేసుకోవాల్సి వుంటుంది.

Latest Videos

click me!