8+8=16 కాదు ... పొలిటికల్ మ్యాథ్స్ లో ఎంతో తెలుసా? : కేటీఆర్ చమత్కారం

First Published | Jul 24, 2024, 6:39 PM IST

తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య అయ్యలు, తాతలు అనుకునే స్థాయిలో మాటల యుద్దం సాగింది. సీఎం రేవంత్, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య కౌంటర్, ఎన్కౌంటర్ సాగింది. ఈ క్రమంలోనే 8+8 ఎంతవుతుందో సరికొత్త లెక్కలు చెప్పారు కేటీఆర్. 

KTR vs Revanth

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య అసెంబ్లీ సాక్షిగా మాటల యుద్దం సాగుతోంది. ఒకరి మాటలకు మరొకరు ఘాటు కౌంటర్స్ ఇచ్చుకుంటున్నారు. విమర్శలు-ప్రతివిమర్శలు, సవాళ్లు-పతిసవాళ్లు, కౌంటర్-రివర్స్ కౌంటర్లతో తెలంగాణ అసెంబ్లీ రసవత్తరంగా మారింది. 

KTR vs Revanth

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం జరుగుతున్న ఇలాంటి కీలక సమయంలో అయినా మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు హాజరు కావాల్సిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇలా కేసీఆర్ ప్రస్తావన తీసుకువచ్చి బిఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టాలని సీఎం ప్రయత్నించారు. కానీ కేటీఆర్ కూడా అదే స్థాయిలో రేవంత్ కు కౌంటర్ ఇచ్చారు. మీకు మేమే ఎక్కువ... కేసీఆర్ అవసరం లేదనేలా కామెంట్ చేసారు.  ఇలా రేవంత్, కేటీఆర్ మధ్య మొదలైన మాటలయుద్దం తారాస్థాయికి చేరుకుంది. 


KTR vs Revanth

చదువుసంధ్య లేకపోయినా అయ్య పేరు చెప్పుకుని పదవులు పొందలేదంటూ కేటీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ కామెంట్స్ చేసారు. తాను జిల్లా పరిషత్ నుండి ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి సీఎం స్థాయికి చేరుకున్నానని అన్నారు. స్వయంకృషితో ఎదిగామే తప్ప అయ్య,తాతపేరు చెప్పుకుని ఈ స్థాయికి రాలేదని రేవంత్ ఎద్దేవా చేసారు. 
 

KTR vs Revanth

కేటీఆర్ కూడా అంతే ఘాటుగా సీఎంకు కౌంటర్ ఇచ్చారు. అయ్యలు,తాతలు అంటూ సీఎం మాట్లాడుతున్నారని... అత్యున్నత పదవిలో వున్న ఆయన ఇలాంటి బాష మాట్లాడటం సరికాదన్నారు. సీఎం పదవిలో వున్నవారికి ఓపిక, సహనం వుండాలన్నారు. మేము కూడా రేవంత్ పేమెంట్ కోటాలో పదవులు పొందాలని అనొచ్చని అన్నారు. 

KTR vs Revanth

అయ్యలు, తాతలు అంటున్నారు... మీ నాయకుడు రాహుల్ గాంధీ గురించేనా అంటోంది..? అంటూ రేవంత్ కు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. ఇలా కాంగ్రెస్ పార్టీవే వారసత్వ రాజకీయాలంటూ గాంధీ కుటుంబం ప్రస్తావన తీసుకువచ్చారు కేటీఆర్.

KTR vs Revanth

ఇక కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే విషయంపై చర్చకు తాము సిద్దంగా వున్నామన్నారు కేటీఆర్. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి నాయకత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మంత్రి వర్గంతో ఆమరణ దీక్షకు కూర్చోవాలి... వాళ్లకు మేము అండగా ఉంటామన్నారు. కేంద్రం ప్రభుత్వంతో కొట్లాటకు తాము సిద్దమే...అందరం కలిసి పోరాడి నిధులు సాధించుకుందామని కేటీఆర్ సూచించారు. 

KTR vs Revanth

బడ్జెట్ లో తెలంగాణ అన్న పదమే వినిపించలేదు... అందుకు కారణం పార్లమెంట్ లో బిఆర్ఎస్ లేకపోవడమేనని కేటీఆర్ అన్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బిజెపి, కాంగ్రెస్ పార్టీలను గుడ్డిగా నమ్మారు... అందుకు ఇప్పుడు గుండుసున్నా మిగిలిందన్నారు. కాంగ్రెస్, బిజెపిలకు తెలంగాణలో చెరో ఎనిమిది ఎంపీ సీట్లు వచ్చాయి... 8+8=16 కావాలి కానీ గుండు సున్నా అయ్యిందంటూ కేటీఆర్ చమత్కరించారు. 
 

KTR vs Revanth

బిజెపి, మోదీ సర్కార్ కు సపోర్ట్ పై ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నారు కేటీఆర్, రేవంత్. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కేంద్రంతో సఖ్యతగా వ్యవహరించలేదు...తాము మాత్రం అలాకాదు...కేంద్రంతో బాగుంటూ నిధులు తెచ్చుకుంటామని సీఎం రేవంత్ అన్నారు... మరి ఇప్పుడేమంటారని కేటీఆర్ ప్రశ్నించారు. గతంలో బిఆర్ఎస్ మోదీ ప్రభుత్వానికి ప్రతి విషయంలోనూ సహకరించారని రేవంత్ అన్నారు. ఇలా అధికార, ప్రతిపక్షాల మధ్య తెలంగాణ అసెంబ్లీలో వార్ జరిగింది. 
 

Latest Videos

click me!