Madhulatha
Rajanna Siricilla : చదువుకునే స్థాయినుండి చదువు'కొనే' స్థాయికి మన విద్యావ్యవస్థ చేరింది. కొందరికి చదువులతల్లి అనుగ్రహించినా... లక్ష్మీకటాక్షం మాత్రం వుండటంలేదు. దీంతో బంగారు భవిష్యత్ కలిగిన పేదల జీవితం ఆ పేదరికంలోనే మగ్గిపోతున్నాయి. అలాంటి పరిస్థితే ఓ తెలంగాణ ఆడబిడ్డకు ఎదురయ్యింది. కోట్లల్లో ఒకరికి వచ్చే అవకాశం ఆ అమ్మాయికి వచ్చింది... కానీ ఆర్థిక కష్టాలు ఆమెను మేకల కాపరిగా మార్చాయి. ఇలా ఓ చదువులతల్లి దీనగాధ హృదయాలను కదిలించేలా వుంది.
Madhulatha
సర్కారు బడినుండి ఐఐటి వరకు :
తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో ఓ మారుమూల గిరిజన గ్రామం గోనె నాయక్ తండా. ఈ గ్రామంలో చదువుకోడానికి సరైన సదుపాయాలు లేవు. కానీ చదువే తమ జీవితాలను మారుస్తుందని నమ్మిన ఓ యువతి ఎన్నో సమస్యలను అదిగమించి విద్యను కొనసాగించింది. ఇలా చిన్నప్పటినుండి చదువుల్లో టాపర్ గా నిలిచింది. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆమె కలలకు తుంచివేసే ప్రయత్నం చేసాయి.
Madhulatha
గోనె నాయక్ తండాకు చెందిన రాములు, సరోజ దంపతులది నిరుపేద కుటుంబం. వీరికి ముగ్గురు ఆడపిల్లలు సంతానం. చదువు గొప్పతనం తెలిసిన రాములు దంపతులు ఆర్థికంగా భారం అయినప్పటికి ముగ్గురు కూతుళ్లను బాగా చదివించారు. పెద్ద కూతుళ్లు ఇద్దరు డిగ్రీ పూర్తిచేసారు. మూడో కూతురు మధులత తాజాగా ఇంటర్మీడియట్ పూర్తిచేసింది.
Madhulatha
అయితే చిన్నప్పటి నుండి చదువుల్లో మంచి ప్రతిభ కనబర్చే మధులత ఇంటర్ లో మంచి మార్కులు సాధించింది. అనంతరం దేశంలోనే టాప్ ఎడ్యేుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఐఐటిల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ లోనూ మంచి ప్రతిభ కనబర్చింది. జేఈఈ మెయిన్స్ లో ఎస్టీ కేటగిరిలో 824వ ర్యాంకు సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా కోట్లాదిమంది విద్యార్థులు కలలుగన్నా దక్కని అవకాశం మధులతకు దక్కింది. ప్రతిష్టాత్మక పాట్నా ఐఐటిలో సీటు వచ్చింది.
Madhulatha
ఐఐటిలో చేరాల్సిన ఆడబిడ్డ మేకల కాపరిగా :
నిరుపేద సిరిసిల్ల ఆడబిడ్డకు ఐఐటిలో సీటు రావడం బాగానే వుంది... సరస్వతి కటాక్షం మెండుగా వున్న ఆమెకు లక్ష్మిదేవి మాత్రం కరుణించలేదు. ఎంట్రన్స్ పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించి ఐఐటి సీటు సాధించినా... కొంత డబ్బు చెల్లించాల్సి వుంటుంది. ఇలా ఉన్నత చదువులకు మధులతకు రూ.3 లక్షలు కావాలి...కానీ ఆమె తల్లిదండ్రులకు అంత డబ్బు చెల్లించే స్తోమత లేదు. దీంతో చదువుల తల్లి ఐఐటీ కల ఆవిరయ్యే పరిస్థితి ఏర్పడింది.
Madhulatha
ఇదే సమయంలో మధులత తండ్రి రాములు కూడా అనారోగ్యం పాలయ్యాడు. దీంతో కుటుంబ పోషనే భారంగా మారింది...దీంతో ఐఐటీ క్యాంపస్ లో వుండాల్సిన మధులత మేకల కాపరిగా మారింది. ఇక తన బ్రతుకు ఇంతే అనుకుని బాధపడుతున్న సమయంలో ఓ లెక్చరర్ రూపంలో ఈ దేవుడే ఆమెకు మార్గం చూపించాడు.
revanth reddy
చదువులతల్లికి అండగా సీఎం రేవంత్ రెడ్డి :
చదువుల్లో చురుకైన మధులతకు పాట్నా ఐఐటీలో సీటు వచ్చినా ఆర్థిక కష్టాలతో చేరలేదన్న విషయం ఆమె లెక్చరర్ బుక్యా లింగం నాయక్ కు తెలిసింది.దీంతో ఆమె ప్రతిభగురించి తనకు తెలిసినవారికి తెలియజేసి ఆర్థిక సాయం కోరారు. ఇలా మధులత గురించి సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు చేరింది. వెంటనే ఆయన స్పందించి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందించారు.
revanth reddy
''రాజన్న సిరిసిల్లకు చెందిన మన తెలంగాణ బిడ్డ బాదావత్ మధులతకు ఐఐటీ పాట్నాలో సీటు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులతో కాలేజీలో చేరలేకపోతున్న విషయం నా దృష్టికి వచ్చింది. పేదరిక కష్టాలను ఎదుర్కొని, ప్రఖ్యాత ఐఐటీలో సీటు సాధించినందుకు ముందుగా తనకు మనస్ఫూర్తిగా నా అభినందనలు. ఏ ఆటంకం లేకుండా ఐఐటీలో తన చదువును కొనసాగించడానికి కావాల్సిన మొత్తాన్ని గిరిజన సంక్షేమ శాఖ ద్వారా నిన్ననే (23 జూలై, 2024) తెలంగాణ ప్రజా ప్రభుత్వం విడుదల చేసింది'' అంటూ సీఎం రేవంత్ ప్రకటించారు. ఇకముందు కూడా తను ఇలాగే రాణించి, తెలంగాణకు మరింత మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నానని సీఎం అన్నారు.
Madhulatha
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు మధులత వివరాలు తెలుసుకొని మాట్లాడారు. ఆమె చదువు నిమిత్తం కుటుంబానికి గిరిజన శాఖ కార్యదర్శి శరత్ రూ 1,51,831 చెక్కును అందజేశారు.
ktr
ఇక మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కూడా మధులతకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆమె చదువుకు సంబంధించిన ఖర్చులు తాను చూసుకుంటానని కేటీఆర్ ప్రకటించారు. ఇలా సాయం అందడంతో మధులత ఐఐటీలో చేరడానికి మార్గం సుగమమైంది.