మీకు రుణమాఫీ వచ్చిందా... అయితే జాగ్రత్త..!!

First Published | Jul 19, 2024, 12:32 PM IST

మీ బ్యాంకు ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు పడ్డాయా..? అయితే జాగ్రత్త. మీరు ఏమాత్రం అజాగ్రత్తగా వున్న ఆ డబ్బులు మాయమయ్యే ప్రమాదం వుంది. కాబట్టి ఈ తప్పులు చేయకండి..  

Rythu Runa Mafi

Rythu Runa Mafi : తెలంగాణ రైతాంగానికి అండగా నిలిచింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కువకాలం ఎదురుచూడకుండానే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చింది... రైతు రుణాలను మాఫీ చేసింది. ఎన్నికల వేళ రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది... ఈ మేరకు ఇప్పుడు మూడు విడతల్లో రుణమాఫీకి సిద్దమయ్యింది. ఇప్పటికే మొదటివిడతలో లక్ష రూపాయల లోపు రైతు రుణాలను మాఫీ చేసారు... రైతుల ఖాతాల్లో డబ్బులు కూడా జమచేసారు. 

Rythu Runa Mafi

బ్యాంకు లోన్లు మాఫీ కావడంతో రైతులు సంతోషంగా వున్నారు. అయితే ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా రైతు ముఖంలోని సంతోషం ఆవిరయ్యే ప్రమాదముంది. ప్రభుత్వం రైతులకు మేలుచేసేందుకు రుణమాఫీ చేస్తే... వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు సిద్దమయ్యారు సైబర్ నేరగాళ్లు. కాబట్టి రైతులు  మరీముుఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వాడేవారు జాగ్రత్తగా వుండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 


Rythu Runa Mafi

ఈ టెక్నాలజీ యుగంలో సైబర్ నేరాలకు కాదేదీ అనర్హం అన్నట్లుగా పరిస్థితి తయారయ్యింది. సాప్ట్ వేర్లను రూపొందించే సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను సైతం బురిడికొట్టిస్తున్నారు సైబర్ కేటుగాళ్లు... ఇక సామాన్యుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒకేసారి వేలకోట్లు తెలంగాణ రైతుల ఖాతాల్లో పడ్డాయి కాబట్టి సైబర్ నేరగాళ్లు కన్ను ఈ డబ్బు పడివుంటుంది. అందువల్ల రైతులకు ముందుజాగ్రత్తలు సూచిస్తున్నారు పోలీసులు. 
 

Rythu Runa Mafi

ఇలా చేసారో రుణమాఫీ డబ్బులు మాయం :

తెలంగాణ ప్రభుత్వం 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లో 6 వేల 90 కోట్ల రుణమాఫీ డబ్బులను జమచేసింది. ఇలా లక్షలాది రైతులకు ఒకేసారి డబ్బులు రావడంతో వీటిని కొట్టేసేందుకు సైబర్ నేరగాళ్లు సరికొత్త ప్లాన్స్ తో రెడీగా వున్నారు. అయితే సైబర్ కేటుగాళ్లు ఎలా మోసం చేస్తారో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు.
 

Rythu Runa Mafi

బ్యాంక్ అధికారుల పేరిట : 

ఇలాంటి మోసాలు ఇప్ప టికే జరుగుతున్నాయి. బ్యాంక్ అధికారుల పేరిట ఫోన్ గానీ, మెసేజ్ గానీ చేస్తారు సైబర్ నేరగాళ్లు. వారి మాటలు నిజమని నమ్మి మన బ్యాంక్ అకౌంట్, ఏటిఎం వివరాలు...ఫోన్ కు వచ్చే ఓటిపి వంటివి చెప్పామో... ఇక అంతే సంగతి. మన బ్యాంకు అకౌంట్లోని డబ్బులను ఊడ్చేస్తారు. రైతులను కూడా ఇలాంటి ఫేక్ బ్యాంక్ అధికారుల పేరిట మోసాలకు పాల్పడవచ్చు... కాబట్టి ఇలాంటి వాటికి రెస్పాన్స్ కావద్దని సూచిస్తున్నారు. ఏదయినా సమస్య వుంటే నేరుగా బ్యాంకుకు వెళ్లి పరిష్కరించుకోవడమే మంచిది...లేదంటే అఫిషియల్ బ్యాంక్ యాప్ ఉపయోగించుకోవాలి. రుణమాఫీ పొందిన రైతులే కాదు ఎవరైన తమ బ్యాంకు వివరాలను ఇతరులకు ఇవ్వొద్దని పోలీసులు సూచిస్తున్నారు. 

Rythu Runa Mafi

వ్యవసాయ అధికారుల పేరిట : 

వ్యవసాయ అధికారుల పేరిట కూడా సైబర్ నేరగాళ్లు రైతులను మోసం చేసే అవకాశాలున్నాయి. రుణమాఫీకి సంబంధించిన వివరాల పేరిట అకౌంట్ డిటెయిల్స్ సేకరించవచ్చు. కాబట్టి వ్యవసాయ అధికారుల పేరుతో వచ్చే కాల్స్, మెసేజెస్ తో జాగ్రత్త. నిజంగానే రుణమాఫీకి సంబంధించి ఏదయినా సమస్య వున్న, ఫిర్యాదు చేయాలన్నా అధికారిక ఐటీ పోర్టల్ లేదంటే మండల స్థాయి సహాక కేంద్రాన్ని సంప్రదించవచ్చు. 
 

Rythu Runa Mafi

వాట్సాప్ మెసేజెస్ : 

ఇటీవల సైబర్ నేరగాళ్లు వాట్సాప్ మెసేజ్ ల ద్వారా నేరాలకు పాల్పడుతున్నారు. బ్యాంకు పేరు, లోగో లేదంటే అధికారి ఫోటోతో వాట్సాప్ మెసేజ్ పంపి కొన్ని లింకులను, ఫైల్స్ ను పంపిస్తున్నారు. వాటిని ఓపెన్ చేసామంటే మన ఫోన్ సైబర్ నేరగాళ్ల కంట్రోల్ లోకి వెళ్లిపోతుంది. దీంతో బ్యాంక్ వివరాలు కూడా వారి చేతిలో పడే ప్రమాదముంది. అంతేకాదు గూగుల్ పే, ఫోన్ ఫే వంటి యూపిఐ ద్వారా మనకు తెలియకుండానే అకౌంట్లోంచి డబ్బులు మాయం చేస్తారు. కాబట్టి అపరిచిత ఫోన్ నెంబర్ల నుండి వచ్చే లింకులు ఓపెన్ చేయవద్దు...బ్యాంకుల పేరిట వచ్చే మెసేజ్ ల పట్ల కూడా జాగ్రత్తగా వుండాలి. 
 
ఫోన్ ఏదయినా మెసేజ్, ఎవరినుండి అయినా కాల్ వస్తే రైతులు జాగ్రత్తగా వ్యవహరించారు. వారు చెప్పేది అనుమానాస్పదంగా వున్నా... అర్థం కాకపోయినా వెంటనే కాల్ కట్ చేయడం, మెసేజ్ అయితే ఓపెన్ చేయకుండా డిలీట్ చేయాలి. నిజంగానే బ్యాంక్ కాల్ లేదా మెసేజ్ అని భావిస్తే నేరుగా బ్యాంకుకు వెళ్లి సంప్రదించాలి.  లేదంటే మీరు సైబర్ నేరాల బారినపడి కష్టార్జితమైన డబ్బులు పోగొట్టుకునే ప్రమాదం ఉంది. 
 

Rythu Runa Mafi

ఆన్లైన్ మోసాలపై ఇలా ఫిర్యాదు చేయండి : 

మీరు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే ఎలాంటి ఆలస్యం చేయకుండా 1930 నంబర్ కి కాల్ చేయండి. లేదంటే www.cybercrime.gov.in లో రిపోర్ట్ చెయ్యండి.  త్వరగా మీరు సమాచారం అందిస్తే మీ డబ్బులు సైబర్ నేరగాళ్ల చేతిలో పడకుండా పోలీసులు కాపాడతారు. 

Latest Videos

click me!