మే నాటికి యాదాద్రి ఆలయం పున:ప్రారంభం: కేసీఆర్ ఆశాభావం

First Published Mar 4, 2021, 9:25 PM IST

పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చిన నేపథ్యంలో యాదాద్రి ఆలయాన్ని మే మాసంలో పునఃప్రారంభం చేసుకునే అవకాశాలున్నాయన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్

పునర్నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చిన నేపథ్యంలో యాదాద్రి ఆలయాన్ని మే మాసంలో పునఃప్రారంభం చేసుకునే అవకాశాలున్నాయన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్
undefined
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను గురువారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ పరిశీలించారు. సుమారు ఆరు గంటలకు పైగా ఆలయ ప్రాంగణంతో పాటు ఆలయం చుట్టు పక్కల అనుబంధంగా జరుగుతున్న పనుల పురోగతిని క్షుణ్ణంగా ప‌రిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
undefined
ఆలయ పునః నిర్మాణ పనులు దాదాపుగా పూర్తికావచ్చిన నేపథ్యంలో ఇంకా అసంపూర్తిగా ఉన్న పనుల పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు సీఎం యాదాద్రిలో పర్యటించారు.
undefined
ఆలయ పై పరిసరాలను పరిశీలించిన అనంతరం కిందికి దిగి, గుట్ట చుట్టూ చేపట్టిన, రహదారులు, బస్ స్టాండ్, రెసిడెన్షియల్ కాటేజ్ లు, కళ్యాణ కట్ట, పుష్కరిణీ, అన్నదాన సత్రం,తదితర అభివృద్ది పనుల పురోగతిని సీఎం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
undefined
యాదాద్రి ఆలయం చుట్టూ నిర్మితమౌతున్న రింగు రోడ్డు లోపలి పరిధిలోని పరిసర ప్రాంతాలను పచ్చదనం తో పరిపూర్ణం చేసి, దైవ భావన పరివ్యాప్తం చేయాలన్నారు. విస్తరణలో కోల్పోతున్న దుకాణం దారులతో సీఎం చాలా సేపు మాట్లాడారు.
undefined
వారు కోల్పోయిన దానికన్నా గొప్పగా వారికి అన్ని వసతులతో కూడిన విశాలమైన రీతిలో షో రూముల తరహాలో నూతన దుకాణాలను కట్టించి ఇస్తామని భరోసా ఇచ్చారు. వారికి ఉచిత ఇంటి స్థలాలను కూడా కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
undefined
అదేవిధంగా గతం లో గుట్ట మీద వ్యాపారాలు చేసుకున్న వారికి టెంపుల్ టౌన్ లో పాత పద్దతిలోనే దుకాణాలు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు.
undefined
స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. అక్కడి నుంచి నిర్మాణం పూర్తి కావచ్చిన ప్రెసిడేన్షియల్ సూట్ ను పరిశీలించి తుది మెరుగుల కోసం పలు సూచనలు చేశారు.
undefined
click me!