పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు: విపక్షాలకు చెక్, కేసీఆర్ ప్లాన్ ఇదీ

Published : Mar 04, 2021, 11:03 AM IST

తెలంగాణలోని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆర్ఎస్ సీరియస్ గా తీసుకొంది. రెండు స్థానాల్లో విజయం సాధించేందుకు గులాబీ దళం పనిచేస్తోంది. 

PREV
110
పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు: విపక్షాలకు చెక్, కేసీఆర్ ప్లాన్ ఇదీ

పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆర్ఎస్ సీరియస్ గా తీసుకొంది. రెండు పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  విజయం సాధించేందుకు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వ్యూహత్మకంగా పావులు కదుపుతోంది.

210

పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లతో కేసీఆర్ నేరుగా మాట్లాడాలని నిర్ణయం తీసుకొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించాలని కేసీఆర్ ఓటర్లను అభ్యర్ధించనున్నారు.

310

ఈ నెల 14వ తేదీన రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ బుధవారం నాడు పార్టీ నేతలు, మంత్రులు, ఆయా జిల్లాల ఇంచార్జీలతో సమావేశమయ్యారు. ఫోన్ లో పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేయాలని కేసీఆర్ కోరనున్నారు. 

410

ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ ఇస్తున్న ప్రాధాన్యతను ఇది చూపుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆర్ఎస్ నాయకత్వం ఇంత సీరియస్ గా ఎప్పుడూ తీసుకోలేదు.

510

ఆరు జిల్లాల్లోని గ్రాడ్యుయేట్స్ ఓటర్ల నెంబర్లను తనకు ఇవ్వాలని సీఎం కేసీఆర్ మంత్రులు, పార్టీ నేతలను ఆదేశించారని సమాచారం. ప్రైవేట్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు, ఐటీ ఉద్యోగులు, న్యాయవాదులు, ఇతర నిపుణులను వర్గీకరించి వారి నెంబర్లను ఇవ్వాలని సీఎం కోరారు.

610

హైద్రాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్; ఖమ్మం, నల్గొండ జిల్లాలకు చెందిన గ్రాడ్యుయేట్స్ తో తాను ఫోన్ లో మాట్లాడుతానని సీఎం పార్టీ నేతలకు చెప్పారు.

710

టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్దితో పాటు సంక్షేమ కార్యక్రమాల గురించి ఓటర్లకు వివరించనున్నారు.రాష్ట్రంలో ఉద్యోగ కల్పన విషయంలో విపక్షాలు టీఆర్ఎస్ పై చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టనున్నారు.

810

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేతనాల పెంపుతో పాటు ఇంక్రిమెంట్స్ ఇచ్చిన విషయాలను కేసీఆర్ గ్రాడ్యుయేట్స్ దృష్టికి తీసుకురానున్నారు.గత ఆరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 1.32 లక్షల ఉద్యోగాలను కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

910

ఉద్యోగులకు కొత్త పే రివిజన్ కమిషన్ గురించి కేసీఆర్ వివరించనున్నారు. అంతేకాదు కొత్తగా ఉద్యోగాల కల్పన విషయాలపై కేసీఆర్ గ్రాడ్యుయేట్స్ తో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తైన తర్వాత సుమారు 50 వేల ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని కేసీఆర్ పట్టభద్రులకు వివరించే అవకాశం ఉంది.

1010

ప్రతి రోజూ ఆరు నుండి 8 గంటల పాటు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో చర్చిస్తున్నారు.దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి చెందడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 కార్పోరేటర్ స్థానాలను గెలుపొందడంతో  ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొంది.

click me!

Recommended Stories