చినజీయర్‌స్వామి ఆశ్రమానికి కేసీఆర్.. యాదాద్రి ఆలయ ప్రారంభం, శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలపై చర్చ (ఫోటోలు)

First Published Jan 9, 2022, 9:54 PM IST

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పున:ప్రారంభంపై చినజీయర్ స్వామితో సమావేశమయ్యారు  సీఎం కేసీఆర్ చర్చించారు

kcr

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పున:ప్రారంభంపై చినజీయర్ స్వామితో సమావేశమయ్యారు  సీఎం కేసీఆర్ చర్చించారు. మార్చి 28న మహా కుంభ సంప్రోక్షణం చేపట్టాలని, 21 నుంచి మహా సుదర్శనయాగం నిర్వహించాలని ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 
 

kcr

ఈ నేపథ్యంలోనే ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమాన్ని ఆదివారం కేసీఆర్ సందర్శించారు. ఆ ఏర్పాట్లు, ఆహ్వానాలు, సంబంధిత అంశాలపై చినజీయర్‌ స్వామితో ముఖ్యమంత్రి చర్చించారు. చినజీయర్ స్వామి ఖరారు చేసిన ముహూర్తం ప్రకారం మార్చి 28న గర్భాలయంలోని స్వయంభువుల నిజదర్శనాలను భక్తులకు కల్పించనున్నారు.
 

kcr

ఫిబ్రవరిలో జీయర్‌ ఆశ్రమంలో జరిగే సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ ఏర్పాట్లను కేసీఆర్ పరిశీలించారు. చినజీయర్ స్వామితో కలిసి యాగశాలను సందర్శించారు. సీఎంతో పాటు మంత్రులు హరీశ్‌ రావు, ప్రశాంత్‌ రెడ్డి, ఎంపీ సంతోష్‌, మైం హోం గ్రూప్స్ అధినేత రామేశ్వరరావు ఉన్నారు.

kcr

ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలను ఆశ్రమంలో నిర్వహిస్తున్నారు. ఆ ఏర్పాట్లను స్వయంగా కేసీఆర్‌కు చినజీయర్ స్వామి వివరించారు. యాగ సమయంలో నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని విద్యుత్ అధికారులను సీఎం ఆదేశించారు. 

kcr

మిషన్‌ భగరీథ నీరు అందించాలని అధికారులకు సూచించారు. యాగానికి సంబంధించి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని పేర్కొన్నారు. యాగశాల వద్ద ఫైర్‌ ఇంజన్లు ఏర్పాటు చేయాలని అగ్నిమాపక శాఖ అధికారులను కేసీఆర్ ఆదేశించారు. 

kcr

యాగానికి వీఐపీలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచనలు చేశారు.

kcr

ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు భగవద్రామానుజుల సహస్రాబ్ది వేడుకలు ముచ్చింతల్‌లోని ఆశ్రమంలో వైభవంగా జరగబోతున్నాయి. సహస్రాబ్ది వేడుకల కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఇప్పటికే ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

click me!