Madhavi Latha On Pawan Kalyan: పవన్ కల్యాణ్ పోస్టు మతమార్పిడిలకు ఎంకరేజ్మెంట్‌లా ఉంది..మాధవీలత సంచలన కామెంట్స్

Published : Dec 25, 2021, 02:58 PM ISTUpdated : Dec 25, 2021, 03:01 PM IST

సినీ నటి మాధవీలత తనదైన వ్యాఖ్యలతో నిత్యం వివాదాల్లో నిలుస్తూ ఉంటారు. అయితే తాను జనసేన అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమాని అని చెప్పుకునే మాధవీలత (Madhavi Latha) తాజాగా ఆయననే టార్గెట్ చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

PREV
18
Madhavi Latha On Pawan Kalyan: పవన్ కల్యాణ్ పోస్టు మతమార్పిడిలకు ఎంకరేజ్మెంట్‌లా ఉంది..మాధవీలత సంచలన కామెంట్స్

సినీ నటి మాధవీలత తనదైన వ్యాఖ్యలతో నిత్యం వివాదాల్లో నిలుస్తూ ఉంటారు. అయితే తాను జనసేన అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమాని అని చెప్పుకునే మాధవీలత (Madhavi Latha) తాజాగా ఆయననే టార్గెట్ చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు.

28

పవన్ కల్యాణ్ క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో చేసిన పోస్టుపై స్పందించిన మాధవీలత.. పవన్ విషెస్ చెప్పిన తీరును తప్పుబట్టారు. పవన్ చేసిన పోస్టు.. మతమార్పిడిలకు ఎంకరేజ్మెంట్‌లా ఉందని విమర్శించారు. ఒక హిందువుగా మీ పోస్టు పట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్టుగా చెప్పారు.
 

38

మాధవీలత తన ఫేస్‌బుక్ పోస్టులో..  ‘పవన్ కల్యాణ్ గారు క్రిస్మస్ విషెస్ చెప్పండి సంతోషం.. నమ్మినవారికి విషెస్ అని చెప్పండి ఇంకా సంతోషం. మానవాళికి లాంటి పెద్దమాటలు ఎందుకండి?. మీరే మతమార్పిడిలకు ఎంకరేజ్మెంట్‌లా ఉంది.. పోస్ట్. విషెస్ పెట్టండి చాలు. బైబిల్ మనం బోధించనక్కర్లేదు. అక్కడ ఎవరూ దేవుడు లేరు. రెస్పెక్ట్ ఇద్దాం అంతవరకే.. మీ విషెస్ తప్ప మీరు రాసిన కంటెంట్ నాకు నచ్చలేదు’ అని అన్నారు. 

48

‘సర్వ ప్రాణుల పట్ల అని యేసు చెప్పలేదు. ఆయన చెప్పారని మొన్నటి వరకు నేను నమ్మిన మీలాగే.. కానీ యూదుల వరకు మాత్రమే ఆయన ప్రేమ. మనం యూదులం కాదండి. మీ పేజ్ మెయింటన్ చేస్తున్నవాళ్లు కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకోవడం మంచింది. మొన్న మీరు కూడా స్పీచ్‌లో బైబిల్ గురించి గొప్పగా చెప్పారు.. అంతా గొప్ప ఏమి లేదండి ఫ్లోలో చెప్పేసి మీరు కూడా కన్వర్షన్స్‌కు కారణం అవ్వొద్దు. చాలా బాధగా ఉంది నాకు’ అని మాధవీలతా అన్నారు.

58

‘మీ పోస్టులో విషెస్ కంటే కన్వర్షన్‌కి సపోర్టింగ్‌గా ఉంది. ఒక హిందువుగా మీ పోస్టు పట్ల విచారం వ్యక్తంచేస్తున్నాను’ అని మాధవీలత పేర్కొన్నారు. ప్రస్తుతం మాధవీలత చేసిన పోస్టు వైరల్‌గా మారింది. 

68

మరోవైపు ఓ వీడియోను మాధవీలత తన ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్టు చేశారు. అందులో.. ‘నేను హిందూవులందరిని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను.. వాటికి సమాధానం చెప్పండి. మన దేశంలో రిలీజియన్ ఉందా..? కచ్చితంగా ఉంది.  బైబిల్‌ను నమ్ముకున్నవారు స్వర్గానికి వెళతారు.. నమ్ముకొనివారు నరకానికి వెళ్తారు అని బైబిలో ఉంది. మనం నమ్ముకోలేదు కాబట్టి నరకానికి వెళతాం. అలాంటప్పుడు మనం క్రిస్మస్‌ను సెలబ్రేట్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్?. వాళ్లు మన ధర్మాని, దేవుళ్లును అగౌరవపరుస్తున్నారు. మీరు మీ పిల్లలకు శాంటా గెటప్‌లు వేయించి, క్రిస్మస్ చెట్లు పెట్టుకుని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు’ అని అన్నారు.

78

‘మనదేశంలోకి చోరుబడిన పోర్చుగీసు, డచ్.. వారి వల్ల క్రిస్టియానిటీ వచ్చింది. మన దేవాలయాలను, సంస్కృతిని నాశనం చేశారు. హిందూ ప్రజలను కన్వర్ట్ చేయడానికి ప్రయత్నించారు. కానీ మనవాళ్లు ధర్మం కోసం వాళ్లతో పోరాడారు. ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటూ మన దేశం కోసం, మతం కోసం ప్రాణాలను అర్పించినవారిని అవమాన పరచాలని అనకుంటున్నావా?. దీపావళి లాంటి పండగులు వస్తే పొల్యుషన్ అంటున్నారు’ అని మాధవీలత పేర్కొన్నారు. 

88

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి సినీ నటి మాధవీలత ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టు‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ 

Read more Photos on
click me!

Recommended Stories