
తెలంగాణ సీఎం కేసీఆర్ బాలాలయంలో శ్రీలక్ష్మి నరసింహాస్వామిని దర్శించుకొన్నారు. ఆలయ పురోహితులు ఇచ్చిన తీర్ధప్రసాదాలను సీఎం స్వీకరించారు.యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం స్వామి వారిని దర్శించు కున్నారు.. తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేసీఆర్ ఈ ఆలయ పునరుద్దరణ పనులను చేపట్టారు. యాదాద్రి ఆలయ పునరుద్దరణ పనులపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆలయ పునరుద్దరణ పనులకు బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఆలయ పునరుద్దరణ పనులకు నిధులకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అవసరమైన నిధులను మంజూరు చేస్తామని కూడా హామీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి ఆలయాన్ని తిరుపతి మాదిరిగా అభివృద్ది చేయాలని కేసీఆర్ తలపెట్టారు. ఇందులో భాగంగానే ఆయన ఆలయ పునరుద్దరణ పనులను ప్రారంభించారు.ఈ ఏడాది మార్చి నాటికి ఆలయ పునరుద్దరణ పనులను పూర్తి చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
'సీఎం కేసీఆర్ కు స్వాగతం పలుకుతున్న నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. సీఎం కు శాలువా కప్పారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో పాటు మంత్రి జగదీష్ రెడ్డి సహా జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా యాదాద్రి చేరుకున్నారు. సీఎం వెంట చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ రావు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయ పునరుద్దరణపై కేంద్రీకరించారు. ఆలయ పునరుద్దరణ పనులపై సీఎం ఎప్పటికప్పుడు అడితి తెలుసుకొంటున్నారు. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి లను ఆలయ పునరుద్దరణ పనులపై సీఎం ఆరా తీస్తున్నారు. ఆలయ పనులపై సీఎం కేసీఆర్ అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు. ఈ మేరకు వేద పడింతుల సూచనలను పాటించాలని కూడా కేీసీఆర్ సూచించారు.
టీఆర్ఎస్ లో చేరిన తర్వాత మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సీఎం కేసీఆర్ తో కలిసి యాదాద్రి ఆలయానికి చేరుకొన్నారు. కేసీఆర్ తో కలిసి ఆయన స్వామి వారిని దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు పూర్ణకుంభం తో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. టీఆర్ఎస్ లో చేరిన తర్వాత మోత్కుపల్లి నర్సింహులు కేసీఆర్ తో కలిసి యాదాద్రికి చేరుకొన్నారు. గతంలో ఆలేరు శాసనసభ స్థానం నుండి నర్సింహులు సుదీర్ఘ కాలం పాటు ప్రాతినిథ్యం వహించారు. టీడీపీ, ఇండిపెండెంట్ , కాంగ్రెస్ అభ్యర్ధిగా ఈ స్థానం నుండి మోత్కుపల్లి నర్సింహులు విజయం సాధించారు.
దళిత బంధుే పథకం ద్వారా దళితులకు కేసీఆర్ న్యాయం చేస్ున్నారని ఆయనను మోత్కుపల్లి నర్సింహులు పొగడ్తలతో ముంచెత్తారు. ఆ తర్వాత కొంతకాలానికే ఆయన బీజేసీకి గుేడ్ బై చెప్పారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. దళిత బంధు పథకం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కావడం లేదని ఆయన గుర్తు చేశారు.
యాదాద్రి ఆలయ పునరుద్దరణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఆలయం మొత్తం కలియ తిరుగుతూ పనులను ఆయన పర్యవేక్షించారు. అనంతరం దాదాపుగా పూర్తికావస్తున్న ఆలయ పరిసరాలను కలియ తిరుగుతూ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రధానాలయం, గర్భగుడిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా పరిశీలించారు. కాలినడకన ఆలయం చుట్టూ తిరిగి పరిశీలించారు.
ఆలయ పునరుద్దరణ పనులపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. పునరుద్దరణ పనులపై సీఎం ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకొన్నారు. అవసరమై మార్పులు సూచించారు. కాలినడకనే ఆలయం మొత్తం ఆయన కలియ తిరిగారు. ఆలయానికి చేరుకొనే ముందు సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా ఆలయ పునరుద్దరణ పనులను ఏరియల్ సర్వే ద్వారా తిలకించారు.. ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్ పలు సూచనలు చేశారు. అయితే అదే సమయంలో వేద పండితుల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. ఈ విషయమై ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.
యాదాద్రి ఆలయ పునరుద్దరణ పనులను పరిశీలించే సమయంలో అవసరమై సలహాలు సూచలను ఇచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఆలయంం మొత్తం కేసీఆర్ కాలినడకన తిరిగారు. అంతేకాదు పునరుద్దరణ పనులను ఆయన పరిశీలించారు. అంతేకాదు పునరుద్దరణ పనుల గురించి కేసీఆర్ అడిగి తెలుసుకొన్నారు. గతంలో నిర్దేశించుకొన్న ప్లాన్ ప్రకారంగా పనులు జరుగుతున్నాయా లేదా అనే విషయమై కూడా సీఎం ఆరా తీశారు. అంతేకాదు గతంలో నిర్ధేశించుకొన్న లక్ష్యం మేరకు పనులను పూర్తి చేయాలని కూడా అధికారులను ఆదేశించారు.
ఆలయ పునరుద్దరణ పనులను పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరూ చిత్తశుద్దితో పనిచేయాలని సీఎం కేసీఆర్ కోరారు.ఈ విషయంలో అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా చొరవ చూపాలని కూడా సీఎం అభిప్రాయపడ్డారు. గతంలో ఈ ఆలయాన్ని చిన జీయర్ స్వామి పరిశీీలించారు. జీయర్ స్వామి సూచనల మేరకు ఆలయ నిర్మాణ పనులు చేపడుతున్నారు. అయితే ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను కూడా అభివృద్ది చేస్తున్నారు.
యాదాద్రి ఆలయంలో లక్ష్మీ నరసింహా స్వామిని దర్శించకొన్న తర్వాత వేద పండితుల ఆశీర్వాదాాలు సీఎం కేసీఆర్ తీసుకొన్నారు. ఆలయ ఈవో స్వామివారి ప్రసాదంను సీఎం కు అందజేశారు. బాలాలయంలో లక్ష్మీనారసింహుడికి సీఎం కేసీఆర్ పూజలు చేశారు. అర్చకులు సీఎం కెసీఆర్ కు ఆశీర్వచనం అందజేశారు. ఈ ఆలయం స్వరూపం దెబ్బతినకుండా పునరుద్దరణ పనులు చేపట్టాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.అంతేకాదు ఇదే సమయంలో వేద పండితుల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని కూడా సీఎం సూచించారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల మాదిరిగానే యాదాద్రి ఆలయాన్ని కూడా తీర్చిదిద్దాలని కూడా కేసీఆర్ తలపెట్టారు. ఈ మేరకు ఈ ఆలయానికి బడ్జెట్ లో నిధులను కేటాయిస్తున్నారు. నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడొద్దని కూడా సీఎం అఁధిికారులను కోరారు. యాదాద్రి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఆ చరిత్ర దెబ్బతినకుండా ఉండేలా ఆలయ పునరుద్దరణ పనులను చేపడుతున్నారు.
యాదాద్రి ఆలయంలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి జగదీష్ రెడ్డి లక్ష్మీ నరసింహ్వాస్మావిని దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా మంత్రిని వేద పండితులు ఆవీర్వదించారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్ం ఏర్పాటైన తర్వాత జగదీష్ రెడ్డి నల్గొండ జిల్లా నుండి జగదీష్ రెడ్డి కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రెండోసారి కూడా కేసీఆర్ కేబినెట్ లో జగదీష్ రెడ్డికి మంత్రి పదవి దక్కింది.
తొలుత విద్యా శాఖ మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి ఆ తర్వాత విద్యుత్ శాఖ మంత్రి పదవి దక్కింది. రెండో టర్మ్ లో కూడా జగదీష్ రెడ్డికి విద్యుత్ శాఖే దక్కింది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి ఇతర పార్టీల నుండి కీలక నేతలు టీఆర్ఎస్ లో చేరారు. అయినా కూడా జగదీష్ రెడ్డే మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. కేసీఆర్ కు జగదీష్ రెడ్డి నమ్మినబంటు అనే పేరు కూడా ఉంది. ఉద్యమం సమయంలో నుండి జగదీష్ రెడ్డి కేసీఆర్ వెంట ఉన్నారు.
యాదాద్రి ఆలయంలో పరిశీలన సమయంలో ఆర్కిెటెక్ట్ ఆనంద్ సాయి తో పాటు పలువురు అధికారులకు ఆలయ పునరుద్దరణ పనులపై సీఎం కేసీఆర్ సూచనలిచ్చారు. కళ్యాణ కట్ట , పుష్కరిణీ నిర్మాణ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం కేసీఆర్ మంత్రులు, అధికారులకు పలు సూచనలు చేశారు.
ఆలయ పునరుద్దరణ విషయంలో గతంలో నిర్ధేశించుకొన్న పనులు ఏ మేరకు పూర్తయ్యాయి. ఎన్ని పనులు పూర్తి చేశామనే విషయాలపై కూడా కేసీఆర్ ఆరా తీశారు. ఈ నెలాఖరు నాటికి పనులను పూర్తి చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మరో వైపు ఆలయ అధికారులు మాత్రం వేద పండితుల సూచనలను మాత్రం పాటించాలని కోరారు. ఈ విషయంలో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తిరుపతి మాదిరిగా తెలంగాణకు యాదాద్రి ఆలయాన్ని రూపొందనుందని తెలంగాణ ైసీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారు. ఈ మేరకు యాదాద్రి ఆలయాన్ని అభివృద్ది చేస్తున్నారు. ఆలయ అభివృద్ది కోసం తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది.
యాదాద్రి ఆలయ పునరుద్దరణ పనులపై సీఎంఓ అధికారి భూపాల్ రెడ్డితో చర్చిస్తున్న సీఎం కేసీఆర్, ఆలయ పునరుద్దరణ పనులను సీఎస్ సోమేష్ కుమార్ పరిశీలించారు.సుదర్శన యాగం తలపెట్టిన యాగ స్థలాన్ని 75 ఎకరాల సువిశాల ప్రాంగణం లో నిర్వహించనున్న యాగశాల ఏర్పాట్లను సీఎం పరిశీలించారు. అన్నదాన సత్రాలు, ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణాలను పరిశీలించారు. ప్రధానాలయం, కోనేరు, రోడ్లను కేసీఆర్ పరిశీలించారు. అనంతరం కాలినడకన ఆలయం చుట్టూ తిరిగి పలు సూచనలు చేశారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి జగదీశ్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, టీఆర్ఎస్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులుతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.
సీఎంఓ లో కీలక అధికారిగా ఉన్న భూపాల్ రెడ్డితో ఁఈ పనుల విషయమై కేసీఆర్ ఆరా తీశారు. ఆలయ పనుల గురించి ఆయన అడిగి తెలుసుకొన్నారు. ఆలయ పునరుద్దరణ పనుల గురించి కేసీఆర్ కు భూపాల్ రెడ్డి పూర్తి వివరాలు అందించారు.
ఆలయ పునరుద్దరణ పనులను మ్యాప్ ద్వారా సీఎం కేసీఆర్ కు వివరిస్తున్న ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి.
ప్రధాన దేవాలయం, ప్రాకారాలు, మాడ వీధులు కలిపి నాలుగున్నర ఎకరాల్లో నిర్మించాలని, మొత్తం 302 ఎకరాల్లో దేవాలయ ప్రాంగణం ఉంటుందన్నారు.
యాదాద్రి గుట్టపై శ్రీలక్ష్మీనర్సింహస్వామి ప్రధాన ఆలయంతో పాటు, శివాలయం, ఆంజనేయస్వామి ఆలయం, గోపురాలు, ప్రాకారాలు, మాడవీధులు, ఈఓ కార్యాలయం, వీవీఐపీ గెస్ట్‌హౌజ్ (ప్రెసిడెన్షియల్ సూట్), అర్చక నిలయం, నైవేద్యం వంటశాల, ప్రసాద మండపం, రథశాల, వ్రతమండపం, స్వామి పుష్కరిణి, క్యూకాంప్లెక్స్, మెట్లదారి, బస్టాప్, పోలీస్ ఔట్‌పోస్ట్, హెల్త్ సెంటర్ ఉండాలని నిర్ణయించారు.గుట్టకింది భాగంలో గండిచెరువును తెప్పోత్సవం నిర్వహించేందుకు అనువుగా తీర్చిదిద్దాలని సూచించారు. బస్వాపూర్ నుండి గండిచెరువుకు నీటి సరఫరా చేస్తామని తెలిపారు. గండిచెరువుకు అనుబంధంగా కోనేరు, కళ్యాణకట్ట నిర్మించాలని తెలిపారు.గుట్టకింది భాగంలోనే ఆలయ బస్టాండ్ నిర్మించాలని, అక్కడి నుండి భక్తులను దేవాలయ వాహనాల ద్వారా గుట్టపైకి తీసుకురావాలని చెప్పారు. గుట్టపైకి వెళ్లేందుకు ఒక దారి, కిందకు దిగేందుకు మరో దారి ఉండటం వల్ల సౌకర్యంగా ఉంటుందన్నారు. మండల దీక్ష తీసుకునే భక్తులకు గుట్ట కిందిభాగంలోనే ఆశ్రమం నిర్మించాలని సూచించారు.
యాదాద్రి ఆలయ పునరుద్దరణ పనుల విషయమై దేవాలయ ఈవో తో చర్చిస్తున్న సీఎం కేసీఆర్. పుష్కరిణీ లో భక్తులు మునిగి వందన కార్యక్రమాలు ఆచరించిన తర్వాత... స్నానం చేసేందుకు పురుషులకు, స్త్రీలకు విడివిడిగా స్నానపు గదుల నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు. వ్రత మండపాల నిర్మాణం, దీక్షాపరుల మండపాలనూ సీఎం పరిశీలించారు.మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ దృష్ట్యా.. సుదర్శన యాగం, ఇతర ఏర్పాట్లపై ఆలయ పండితులు, అధికారులతో కేసీఆర్ సమీక్షించి, పలు సూచనలు చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో యాదాద్రిలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
దేశంలోని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా యాదాద్రిని సందర్శించాలన్న కోరిక కలిగేలా నిర్మాణాలు అత్యద్భుతంగా ఉండాలన్నారు. యాదాద్రి పునరుద్దరణ తర్వాత భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో పెరిగే భక్తుల సంఖ్యను అంచనావేసి, అందుకు అనుగుణంగా వౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.