పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు 100 రోజులు.. కేక్ కటింగ్, భట్టి విక్రమార్కకు అభినందనల వెల్లువ

Siva Kodati |  
Published : Jun 23, 2023, 09:27 PM IST

సీఎల్పీ నేత, కాంగ్రెస్ సీనియర్ నేత భ‌ట్టి విక్ర‌మార్క ప్రారంభించిన పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర నేటితో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నేతలు , కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలియజేశారు. 

PREV
15
పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు 100 రోజులు.. కేక్ కటింగ్, భట్టి విక్రమార్కకు అభినందనల వెల్లువ
bhatti vikramarka

తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలని సీఎల్పీ నేత, కాంగ్రెస్ సీనియర్ నేత భ‌ట్టి విక్ర‌మార్క ప్రారంభించిన పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర నేటితో వంద రోజులు పూర్తి చేసుకుంది. 
 

25
bhatti vikramarka

ఈ సంద‌ర్భంగా న‌కిరేక‌ల్ నియోజ‌క‌వ‌ర్గం కేతేప‌ల్లి మండ‌లం ఉప్ప‌ల‌పాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. మాజీ మంత్రి రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి కేక్ క‌ట్ చేసి భట్టి విక్రమార్కకు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. 

35
bhatti vikramarka

మాజీ మంత్రి సంభానీ చంద్రశేఖర్ ఖమ్మం నుంచి పార్టీ అనుచర గణంతో ఉప్పలపాడు గ్రామానికి చేరుకొని భట్టి విక్రమార్కను పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు. 100 రోజులు పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.  

45
bhatti vikramarka

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య ఈ సందర్భంగా భట్టి విక్రమార్కను కలిసి పుష్పగుచ్చం అందించి 100 రోజులు పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.  

55
bhatti vikramarka

భట్టి విక్రమార్క పాదయాత్ర 100వ రోజు కేతపల్లి మండల కేంద్రం నుంచి చీకటి గూడెం, ఉప్పలపాడు, భాగ్యనగరం, కొప్పోలు గ్రామం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ప్రజలకు భరోసా ఇస్తూ భట్టి ముందుకు సాగారు

click me!

Recommended Stories