అమిత్ షాతో భేటీ కానున్న కేటీఆర్.. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాం..!!

Published : Jun 23, 2023, 10:02 AM IST

తెలంగాణలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ  ఎన్నికలు జరగనున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఢిల్లీ కేంద్ర హోం  మంత్రి అమిత్ షాను కలవనున్నారు.

PREV
19
అమిత్ షాతో భేటీ కానున్న కేటీఆర్.. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాం..!!

తెలంగాణలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ  ఎన్నికలు జరగనున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీల మధ్య గత కొంతకాలంగా పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపించాయి. రాష్ట్ర అభివృద్దికి కేంద్రం సహకరించడం లేదని బీఆర్ఎస్.. రాష్ట్రానికి కేంద్రం ఎంతో సహాయం చేశాయని బీజేపీ వాదిస్తోంది. కేసీఆర్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ.. బీజేపీ సమాఖ్య స్పూర్తికి విఘాతం కలిగిస్తుందని బీఆర్ఎస్ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.
 

29

అయితే ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత  సంతరించుకుంది. రెండు  రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లనున్న కేటీఆర్.. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. గత ఏడాదిన్నరగా బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఉన్న వైరం కారణంగా రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీ వెళ్లడం మానేశారు.

39

గతంలోనూ పలుమార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేటీఆర్‌ కేంద్ర మంత్రులను కలిసినప్పటికీ అమిత్‌ షాతో భేటీ కాలేదు. కేటీఆర్ చివరిసారిగా 2022 జూన్‌లో ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిశారు. అయితే ఇప్పుడు చాలా రోజుల తర్వాత కేటీఆర్ ఢిల్లీ వెళ్లడం.. అక్కడ కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, హర్దీప్ సింగ్ పూరీలతో సమావేశం కానుండటం చర్చనీయాంశంగా మారింది. 

49

ముఖ్యంగా అమిత్ షాతో కేటీఆర్ భేటీ కానుండటంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. గత ఏడాది  కాలంగా బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు.. గత కొన్ని వారాలుగా విమర్శలను తగ్గించారు. మరోవైపు బీఆర్ఎస్‌పై బీజేపీ వైఖరికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి నేతలు చేసిన కామెంట్స్ కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 
 

59

అలాగే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా.. బీఆర్ఎస్ అనేది బీజేపీ బీ టీమ్ అని ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో అమిత్‌ షాను కలిసేందుకు కేటీఆర్‌ ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. 
 

69

రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరేందుకే కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్థి కార్యక్రమాలకు కేంద్రప్రభుత్వం నుంచి సహకారం లభించడం లేదని, పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర అంశాల విషయంలో మరోసారి మరింత ఒత్తిడి తీసుకువచ్చేందుకే కేటీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారని ఆ వర్గాలు చెబుతున్నాయి.

79

రసూల్‌పుర వద్ద చేపట్టిన రోడ్డు అభివృద్థి కార్యక్రమాలకు హోంశాఖ పరిధిలో ఉన్న భూముల గురించి కేటీఆర్‌ అమిత్‌ షాతో చర్చించినట్టుగా చెబుతున్నారు. అయితే అమిత్ షాతో జరిగే సమావేశంలో రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత రాష్ట్రంలో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదని.. రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

89
ktr

ఇక, హైదరాబాద్‌లో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ కింద ప్రారంభించిన స్కైవేల నిర్మాణానికి కంటోన్మెంట్ భూమిని విడిచిపెట్టనందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఆగ్రహంతో ఉందని.. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కేటీఆర్‌ ప్రస్తావించనున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

99

వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయం అభివృద్ధిపై పౌర విమానయాన శాఖ మంత్రి సింధియాతో కేటీఆర్ చర్చించనున్నారు. అలాగే హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న మెట్రో విస్తరణ కోసం కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందన రాకపోవడంతో ఈ విషయాన్ని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో కేటీఆర్ ప్రస్తావించనున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories