జగన్‌కి కేసీఆర్ కౌంటర్: కృష్ణా నదిపై ప్రాజెక్టుల నిర్మాణానికి తెలంగాణ కేబినెట్ గ్రీన్‌సిగ్నల్

First Published Jun 20, 2021, 11:35 AM IST

కృష్ణానదిపై ప్రాజెక్టుల నిర్మాణానికి  తెలంగాణ  ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది. కృష్ణా నదిపై ేపీ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది.

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి కౌంటరిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమైంది. కృష్ణా నదిపై ప్రాజెక్టుల నిర్మాణానికి తెలంగాణ సర్కార్ ప్రణాళికలను సిద్దం చేసింది. ప్రాజెక్టుల నిర్మాణానికి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది.
undefined
శ్రీశైలం ప్రాజెక్టు నుండి కృష్ణా నది నీటిని రాయలసీమకు తరలించేందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణంతో పాటు తుంగభద్రపై రాజోలిబండ్ డైవర్షన్ స్కీమ్ కుడి కాలువను నిర్మించడంపై తెలంగాణ కేబినెట్ శనివారం నాడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కృష్ణానదిపై ఏపీ ప్రభుత్వం చట్ట విరుద్దమైన ప్రాజెక్టులు చేపడుతోందని తెలంగాణ కేబినెట్ అభిప్రాయపడింది.
undefined
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్ల తర్వాత కూడ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నది నీటి వాటాలో న్యాయమైన వాటాను కల్పించడంలో కేంద్రం వైఫల్యం చెందిందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
undefined
కృష్ణా నదిలో తెలంగాణకు న్యాయమైన నీటి వాటాను కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కూడ కేంద్రం సూచనతో తెలంగాణ ఉపసంహరించుకొంది. కానీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదాలను పరిష్కరించడంలో కేంద్రం మీనమేషాలు లెక్కపెడుతోందని తెలంగాణ సర్కార్ తీవ్ర అసంతృప్తితో ఉంది.
undefined
పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు అవసరాలను తీర్చేందుకు ఆలంపూర్ వద్ద ప్రాజెక్టు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. సుమారు 60 నుండి 70 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవాలని తెలంగాణ సర్కార్ తలపెట్టింది
undefined
పులిచింతల ఎడమ కాలువను నిర్మించి సూర్యాపేట, నల్గొండ జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలని తలపెట్టారు.
undefined
మహబూబ్‌నగర్ జిల్లాలోని నడిగడ్డ ప్రాంతానికి లక్ష ఎకరాలకు సాగు నీరు ఇవ్వడానికి సుంకేసుల రిజర్వాయర్ వద్ద మరో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించనున్నారు. భీమా నది తెలంగాణలోకి ప్రవేశించే కుసుమూర్తి గ్రామంలో వరద కాలువను నిర్మించాలని నిర్ణయం తీసుకొన్నారు.
undefined
కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ రిజర్వాయర్ల సామర్ధ్యాన్ని 20 టీఎంసీల అడుగులకు పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది. వర్షాకాలంలో కృష్ణానదికి వచ్చే వరదను ఉపయోగించుకొని జల విద్యుత్ ను ఉత్పత్తి చేయడం ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కారణంగా విద్యుత్ ఖర్చును తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకొందిన కేసీఆర్ సర్కార్.
undefined
కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై పోరాటం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకొంది.
undefined
click me!