హుజూరాబాద్ బైపోల్: ఆ మూడు పార్టీలకు చావో రేవో

First Published Jun 17, 2021, 2:27 PM IST

హుజూరాబాాద్ అసెంబ్లీ స్థానంపై రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఇప్పటి నుండే కసరత్తు చేస్తున్నాయి. ఈ ఎణ్నికల్లో గెలుపు కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి.

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
undefined
హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి మాజీ మంత్రి ఈ నెల 12న ఈటల రాజేందర్ రాజీనామా చేశారు.రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. ఈ స్థానం ఖాళీ అయిందని స్పీకర్ కార్యాలయం ఈసీకి సమాచారం పంపింది.
undefined
2004 అసెంబ్లీ ఎన్నికల నుండి ఈ స్థానం నుండి ఈటల రాజేందర్ వరుసగా విజయం సాధిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఇంతకాలంపాటు ఆయన పోటీ చేసి విజయం సాధించారు.
undefined
రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. ఈ నెల 14న ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. త్వరలో జరిగే హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా ఈటల రాజేందర్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
undefined
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో విజయం సాధించాల్సిన అనివార్య పరిస్థితులు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లపై నెలకొన్నాయి. టీఆర్ఎస్ ను ఈటల రాజేందర్ వీడడంతో ఈ స్థానంలో విజయం సాధించాల్సిన అనివార్య పరిస్థితులు గులాబీ దళంపై ఉన్నాయి.
undefined
రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యాహ్నాయమని కాంగ్రెస్ , బీజేపీలు పోటీలు పడుతున్నాయి.దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలను సాధించింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది.
undefined
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితం దక్కలేదు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో ఈ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో మెరుగైన ఫలితం దక్కనుందని బీజేపీ లెక్కలు వేసుకొంటుంది
undefined
అయితే ఇదే స్థానం నుండి పోటీ చేసేందుకు మాజీ మంత్రి, బీజేపీ నేత పెద్దిరెడ్డి కూడ ఆసక్తిని చూపుతున్నారు. అధిష్టానం ఆదేశిస్తే హుజూరాబాద్ నుండి పోటీకి సిద్దమని ఆయన ప్రకటించడం కమలదళంలో కలకలం రేపుతోంది.
undefined
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాతి నుండి కాంగ్రెస్ పార్టీకి కలిసిరాలేదు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా కూడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. వరుసగా రెండు దఫాలు ఆ పార్టీ అధికారానికి దూరమైంది.
undefined
కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికల్లో ఓటమిని మూటగట్టుకొంటుంది. 2014 నుండి 2018 వరకు 2018 నుండి ఇప్పటివరకు జరిగిన ఉప ఎన్నికలతో పాటు ఇతర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలను సాధించలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకొంది.
undefined
దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించాల్సిన అనివార్య పరిస్థితులు ఆ పార్టీపై ఉన్నాయి. దీంతో ఈ మూడు పార్టీలు ఈ ఎన్నికల్లో విజయం కోసం సర్వశక్తులను కూడగట్టుకొంటున్నాయి.
undefined
click me!