Telangana Budget 2024 : రేవంత్ బంపరాఫర్ ... మీకు ఫ్రీగా 12వేల రూపాయలు

First Published | Jul 25, 2024, 1:40 PM IST

తెలంగాణ బడ్జెట్ 2024-25 ను ఆర్ధిక మంత్రి భట్టిి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రూ.12 వేల రూపాయలను ఇచ్చే పథకాన్ని ఆయన ప్రకటించారు. ఇంతకూ ఈ మొత్తం ఎవరికి ఇస్తారంటే...

Telangana Budget 2024

Telangana Budget 2024 : కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతర్వాత మొదటిసారి తెలంగాణ పూర్తిస్థాయి బడ్జెట్ రూపుదిద్దుకుంది. రాష్ట్ర బడ్జెట్ 2024-25 ని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ లో ఎన్నికల హామీలను అమలు చేసేందుకు భారీ నిధులు కేటాయించారు.   

Telangana Budget 2024

తెలంగాణ వార్షిక బడ్జెట్ 2,91,159 కోట్లు అయితే అందులో సింహభాగం వ్యవసాయ, అనుబంధ రంగాలకే కేటాయించారు. బడ్జెట్ లో కేవలం వ్యవసాయ రంగానికే  72 వేల 659 కోట్లు కేటాయించారు. వ్యవసాయం చేసే రైతులకే కాకుండా రైతు కూలీలకు లబ్ది చేకూర్చే నిర్ణయాలను ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. 
 


Telangana Budget 2024

భూమిలేని గ్రామీణప్రాంత ప్రజలు ఎక్కువగా వ్యవసాయ కూలీపైనే ఆధారపడతారు. వీరికి పంటల కాలంలోనే ఉపాధి లభిస్తుంది... మిగతా సమయంలో ఉపాధి దొరక్క జీవనోపాధి ఇబ్బందికరంగా మారుతోంది. ఇలా ఎలాంటి ఆర్థిక భద్రత లేకపోవడంతో రైతు కూలీ కుటుంబాలు పస్తులుండే పరిస్థితి ఏర్పడింది. ఇది గుర్తించిన కాంగ్రెస్ సర్కార్ రైతు కూలీల కోసం ప్రత్యేక పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. 
 

Telangana Budget 2024

భూమిలేని రైతు కూలీలకు ప్రతి ఏటా రూ.12,000 ఇవ్వనున్నట్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ సంవత్సరంలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. దీని ద్వారా లక్షలాదిమంది నిరుపేద రైతు కూలీలకు ఆర్థిక భరోసా లభిస్తుందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 
 

Telangana Budget 2024

ఇక రైతుల సంక్షేమానికి కూడా భారీగా నిధులు కేటాయించినట్లు భట్టి తెలిపారు. రైతులు, రైతు కూలీల సంక్షేమమే వ్యవసాయాన్ని పండగలా మారుస్తుందని ఆయన పేర్కొన్నారు. అన్నదాతలకు అండగా నిలవడం ప్రభుత్వాల భాద్యత...దాన్ని తాము నెరవేరుస్తున్నామని ఆర్థిక మంత్రి భట్టి పేర్కొన్నారు. 

Latest Videos

click me!