కేంద్రానికి తెలంగాణ నుండి వెళ్లేదెంత... కేంద్రం తిరిగి ఇచ్చేదెంత..? తెలిస్తే షాక్ అవుతారు..!!

First Published | Jul 24, 2024, 8:51 PM IST

తెలంగాణ అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై వాడివేడి చర్చ జరిగింది. ఈ క్రమంలో తెెలంగాణ నుండి కేంద్రానికి ఎంత ఆదాయం వస్తోంది... తెలంగాణకు కేంద్రం ఇస్తోంది..? అనే వివరాలను సీఎం రేవంత్ వెల్లడించారు.  ఈ లెక్కలు ఎలా వున్నాయంటే... 

Revanth Reddy

Revanth Reddy : కేంద్ర బడ్జెట్ 2024-25 లో తెలంగాణకు అన్యాయం జరిగిందని అధికార కాంగ్రెస్ తో ప్రతిపక్ష బిఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ కు భారీగా నిధులు కేటాయించిన కేంద్రం బడ్జెట్ లో అసలు తెలంగాణ ప్రస్తావనే తీసుకురాలేదు. దీంతో మోదీ సర్కార్ పై తెలంగాణ రాజకీయ పక్షాలు భగ్గుమంటున్నాయి. దక్షిణాదిన కర్ణాటక తర్వాత బిజెపికి అత్యధిక స్థానాలు అందించిన రాష్ట్రం తెలంగాణ. అలాంటి రాష్ట్రానికి బిజెపి నేతృత్వంలోని ఎన్డిఏ ప్రభుత్వం బడ్జెట్ లో మొండిచేయి చూపించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 

telangana assembly

 తాజాగా తెలంగాణ అసెంబ్లీలో కూడా కేంద్ర బడ్జెట్ లో జరిగిన అన్యాయంపై వాడివేడి చర్చ జరిగింది. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల సభ్యులు మోదీ సర్కార్ తీరుపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్దం సాగింది. ఇద్దరూ అయ్యలు, తాతలు పేరు చెప్పుకుని పదవులు పొందలేదని సీఎం అంటే... పేమెంట్ కోటాలో పదవులు పొందారంటూ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఇలా పరస్పర మాటలయుద్దం మధ్యే కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై చర్చించారు. 


Revanth Reddy

ఈ సందర్భంగా సీఎం రేవంత్ ఆసక్తికర లెక్కలు బైటపెట్టారు. తెలంగాణకు కేంద్రం భారీగా ఆదాయం సమకూరుస్తోందని... కానీ అందులో సగం కూడా తిరిగి రాష్ట్రానికి రావడం లేదన్నారు. తెలంగాణ కేంద్రానికి ఇచ్చేదే ఎక్కువు... తిరిగి తీసుకునేది చాలా తక్కువగా వుందంటూ ఆ లెక్కలను ముఖ్యమంత్రి రేవంత్ బైటపెట్టారు. 

revanth reddy

రేవంత్ చెప్పిన లెక్కలివీ : 

తెలంగాణ కేంద్రానికి పన్నుల రూపంలో ఏకంగా రూ.3 లక్షల కోట్లను ఇస్తోందన్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని అన్నారు. అయితే కేంద్రం మాత్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తోంది... కేవలం లక్షా 68 కోట్ల రూపాయలు మాత్రమే తిరిగి ఇస్తోందన్నారు. అంటే మనం ఇచ్చినదాంట్లో కేవలం సగమే ఇస్తోందని రేవంత్ పేర్కొన్నారు. 

Telangana Map

కేవలం ఒక్క తెలంగాణకే కాదు దక్షిణాది రాష్ట్రాలన్నింటికి ఎన్డిఏ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని సీఎం రేవంత్ ఆరోపించారు. బిహార్ విషయమే చూసుకుంటే ఆ రాష్ట్రం కేంద్రానికి ఒక రూపాయి ఇస్తే తిరిగి వారికి రూ.7.26 పైసలు తిరిగి ఇస్తున్నారని అన్నారు. ఇలా తెలంగాణ రూపాయి ఇస్తే కేవలం 43 పైసలే తిరిగి ఇస్తున్నారని రేవంత్ తెలిపారు. 

Revanth Reddy

మొత్తంగా చూసుకున్నా ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి అందించే ఆదాయం ఎక్కువ... తిరిగి పొందుతున్నది చాలా తక్కువని రేవంత్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు పన్నుల రూపంలో కేంద్రానికి 22 లక్షల 26 వేల కోట్ల రూపాయలు చెల్లిస్తోందని అన్నారు. కానీ కేంద్రం ఐదు దక్షిణాది రాష్ట్రాలకు కలిపి తిరిగి ఇస్తున్నది 6 లక్షల 42 వేల కోట్ల రూపాయలేనని తెలిపారు. ఇది కేవలం ఒక్క ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చే నిధుల కంటే తక్కువేనని రేవంత్ అన్నారు.  

Modi Yogi

ఉత్తర ప్రదేశ్ కేంద్రానికి చేకూర్చే ఆదాయం కేవలం రూ.3 లక్షల 41 వేల కోట్లు మాత్రమే. కానీ కేంద్ర నుండి తిరిగి పొందేది రూ.6 లక్షల 91 కోట్లు అని రేవంత్ వెల్లడించారు. ఇది ఐదు దక్షిణాది రాష్ట్రాలకు ఇచ్చే నిధులకంటే ఎక్కువ... దీన్ని బట్టే మోదీ సర్కార్ చూపిస్తున్న వివక్షకు నిదర్శనమని అన్నారు. 

revanth reddy

ఎప్పటిలాగే తాజా బడ్జెట్ లో కూడా తెలంగాణకు అన్యాయం జరిగిందని రేవంత్ అన్నారు. అందువల్లే కేంద్ర తీరుపై అసెంబ్లీలో చర్చించాల్సి వస్తోందన్నారు. న్యాయంగా రావాల్సిన నిధులను పొందడం మన హక్కు...వాటిని సాధించుకునేందుకు పోరాటం చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.  

Revanth reddy Sonia Gandhi

ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలోనే తెలంగాణ అభివృద్ధికి కావాల్సినవన్నీ ఇవ్వాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని రేవంత్ అన్నారు. వీటిని  విభజన చట్టంలో కూడా పొందుపర్చినట్లు తెలిపారు. ఇలా తెలంగాణపై సోనియా గాంధీ ప్రేమను ప్రదర్శించారు. కానీ మోదీ ప్రభుత్వం విభజన హామీలు అమలు  చేయడంలో నిర్లక్ష్యం వహించిందన్నారు. రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చాక వీటిని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాం...కానీ ఏ లాభం లేకుండా పోయిందని సీఎం రేవంత్ అన్నారు.
 

Narendra Modi Revanth Reddy

కేంద్ర ప్రభుత్వం వైఖరిపై తెలంగాణ ప్రభుత్వం నిరసన తెలియజేస్తుందని రేవంత్ అన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని రేవంత్ ప్రకటించారు. 

revanth meets sonia gandhi

మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ హయాంలోనే దేశ అభివృద్ధికి బాటలు పడ్డాయన్నారు. వారి స్ఫూర్తితో ఇందిరాగాంధీ ఎన్నో సరళీకృత విధానాలను తీసుకొచ్చారని రేవంత్ పేర్కొన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్నారన్నారు. ఆ తర్వాత  సోనియాగాంధీ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా దేశాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేశారన్నారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డిఏ దేశాన్ని నాశనం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 

Latest Videos

click me!