కరెంట్ బిల్లులు ఏ స్థాయిలో పెరుగుతాయో తెలుసా?
ప్రస్తుతం తెలంగాణ విద్యుత్ శాఖ గృహ వినియోగదారులకు డొమెస్టిక్ కేటగిరి కింద కరెంట్ బిల్లు వసూలు చేస్తోంది. అంటే ఈ కేటగిరీ కింద చాలా తక్కువ ధరకే విద్యుత్ అందిస్తుంది. వాణిజ్య, పరిశ్రమలు వంటి విభాగాలకు అధిక చార్జీలు వసూలు చేస్తుంది.
అయితే తాజాగా డొమెస్టిక్ వినియోగదారులకు షాక్ ఇచ్చేందుకు తెలంగాణ విద్యుత్ శాఖ సిద్దమైందట. నిబంధనల పేరిట టిజిఎస్పిడిసిఎల్ విద్యుత్ బిల్లులు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అన్ని గృహాలకు డొమెస్టిక్ కేటగిరీ కింద విద్యుత్ బిల్లులు వసూలు చేసేవారు... కానీ ఇకపై ఈ రూల్స్ చేంజ్ చేయనుందట టిజిఎస్పిడిసిఎల్.
కేవలం ప్రభుత్వ అనుమతులు కలిగిన ఇళ్ళనే ఈ డొమెస్టిక్ కేటగిరీ కింద పరిగణించనున్నారు... అనుమతులు లేని ఇళ్ళను టెంపరరీ కేటగిరీగా పరిగణించనున్నారట. అంటే అనుమతులు లేని ఇళ్లకు డొమెస్టిక్ కేటగిరీ వర్తించదన్నమాట. దీంతో ఆ ఇళ్లకు అత్యధిక బిల్లులు వసూలు చేయనున్నారు. ఈ నిర్ణయంతో తెలంగాణలో చాలామందికి విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి.
ముఖ్యంగా హైదరాబాద్ వాసులపై ఈ ప్రభావం ఎక్కువగా వుండనుంది. ఒక్క నగరంలోనే దాదాపు 10 లక్షల మందిపై విద్యుత్ భారం పెరగనున్నట్లు తెలుస్తోంది. బహుళ అంతస్తుల భవనాల్లో కొన్నింటికే అనుమతులు వుంటాయి... మిగతావాటిని అనుమతులు లేకుండానే నిర్మిస్తుంటారు. ఇలాంటి ఇళ్లపై విద్యుత్ భారం పెరగనుంది. ఇప్పుడు వస్తున్న బిల్లుకు డబుల్, ట్రిపుల్ బిల్లు వస్తుందన్నమాట.