Telangana Assembly Elections 2023 : కాంగ్రెస్ మేనిఫెస్టో రెడీ.. ఇలాంటి సరికొత్త హామీలతో ప్రజలముందుకట...

First Published | Nov 1, 2023, 11:58 AM IST

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమేం చేయనుందో... ఎలా పాలన సాగించనుందో పొందుపర్చిన మేనిఫెస్టో రెడీ అయినట్లు... తుది కసరత్తు జరుగుతోందని ఎమ్మెల్యే  శ్రీధర్ బాబు తెలిపారు. 

Congress Party

హైదరాబాద్ : తెలంగాణలో ఈసారి ఎలాగయినా గెలిచి అధికారాన్ని చేజిక్కించకోవాలని చెయ్యిగుర్తు పార్టీ భావిస్తోంది. ఇప్పటికే పార్టీలోకి భారీగా చేరికలను ఆహ్వానిస్తూ, ప్రచారాన్ని హోరెత్తిస్తూ అధికార బిఆర్ఎస్ కు దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. దీంతోపాటు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సక్సెస్ అయిన వ్యూహాలను తెలంగాణలోనూ వాడుతోంది కాంగ్రెస్. ఇప్పటికే ఆరు గ్యారంటీలను ప్రకటించి వాటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళుతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు పూర్తి హామీలతో కూడిన మేనిఫెస్టోను కూడా సిద్దంచేసిన హస్తం పార్టీ విడుదలకు సిద్దమయ్యింది. 
 

Sridhar Babu

ఇవాళ తెలంగాణ పిసిసి మేనిఫెస్టో కమిటీ ఆ పార్టీ కార్యాలయం గాంధీభవన్ లో సమావేశం అయ్యింది. ఈ కమిటీ ఛైర్మన్ శ్రీధర్ బాబుతో పాటు ఇతర సభ్యులు మరోభేటీ అయి మేనిఫెస్టోలో ఇప్పటికే చేర్చిన అంశాలపైనే కాదు ఇంకేమైనా చేర్చాల్సిన అవసరం వుందా అన్నదానిపై చర్చించారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలతో పాటు ఇంకా ఏమేం చేయనుందో మేనిఫెస్టో ద్వారా ప్రజలకు తెలుపనున్నారు.  


sreedhar babu

ఈ సందర్భంగా మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ శ్రీధర్ బాబు మాట్లాడుతూ... రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఇప్పటికే మేనిఫెస్టోపై కసరత్తు తుది దశకు చేరుకుందని... త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రజా మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ రూపొందించిందని... అధికారంలోకి రాగానే హామీలన్నింటిని పూర్తిచేస్తామని అన్నారు.  

Telangana Congress

తెలంగాణ సమాజంలోని అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా కాంగ్రెస్ మేనిఫెస్టో వుంటుందని శ్రీధర్ బాబు తెలిపారు. ముఖ్యంగా విద్య, విద్య రంగాలను బలోపేతం చేసేలా కాంగ్రెస్ పాలన వుంటుందన్నారు. ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం అందేలా చూస్తామని... ఇందుకోసం సరికొత్త అంశాలను మేనిఫెస్టోలో పొందుపర్చినట్లు శ్రీధర్ బాబు వెల్లడించారు. 

telangana schools

ప్రాథమిక విద్య ప్రతి విద్యార్ధికి  అందించడమే కాదు చిన్ననాటి నుండే వ్యక్తిత్వ వికాసం పెంపొందించేలా విద్యావ్యవస్థను తీర్చిదిద్దుతామని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ తెలిపారు. ఇప్పటికే వున్న ఎన్ సి సి, ఎన్ ఎస్ ఎస్ లాంటి కొత్త కార్యక్రమాల రూపకల్పన వుంటుందన్నారు. వీటి గురించి కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపర్చినట్లు శ్రీధర్ బాబు తెలిపారు. 

revanth reddy

ఇక ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారంటీలు, వివిధ డిక్లరేషన్లకు సంబంధించిన అంశాలను కూడా మేనిఫెస్టోలో పొందుపర్చినట్లు శ్రీధర్ బాబు తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతికి పాటుపడే అంశాలు  మేనిఫెస్టోలో వుంటాయన్నారు. మొత్తంగా తెలంగాణ అభివృద్ది, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ మేనిఫెస్టో రూపకల్పన జరిగిందని శ్రీధర్ బాబు అన్నారు. 

Latest Videos

click me!