హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ బరిలోకి దిగుతున్నారు. ముఖ్యంగా అధికార బిఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు వుండనుందని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. ఈ క్రమంలో కొన్ని సంస్థలు చేపడుతున్న సర్వే ఫలితాలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. కొన్ని సర్వేలు కాంగ్రెస్ కు, మరికొన్ని సర్వేలు బిఆర్ఎస్ కు మెజారిటీ వస్తుందని తేలుస్తున్నాయి. తాజాగా శ్రీ ఆత్మసాక్షి సర్వే స్వల్ప మెజారిటీతో బిఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించే అవకాశాలున్నాయని ప్రకటించింది.