తెలంగాణ ఉద్యోగులకు దసరా సెలవులు..
తెలంగాణ విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా ఆంధ్ర ప్రదేశ్ లో కంటే ఎక్కువగా దసరా సెలవులు ఉన్నాయి. తెలంగాణ ప్రజలు బతుకమ్మ వేడుకలను వైభవంగా జరుపుకుంటారు… అలాగే దసరా అనేది చాలా పెద్ద పండగ. అందుకే ఉద్యోగుకులకు కూడా వరుసగా నాలుగైదు రోజుల సెలవులు వస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు...
అక్టోబర్ 18 (ఆదివారం) - సద్దుల బతుకమ్మ పండగ సందర్భంగా అధికారిక సెలవు ఇచ్చింది ప్రభుత్వం. అయితే ఈరోజు పండగ సెలవు లేకున్నా ఆదివారం సాధారణ సెలవు ఉండేది.
అక్టోబర్ 19 (సోమవారం) - మహర్నవమి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే ఉంది. అంటే ముందుస్తు అనుమతితో ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు.
అక్టోబర్ 20 (మంగళవారం) - విజయదశమి (దసరా) పండగ సందర్భంగా ఉద్యోగులందరికి సెలవు ఉంటుంది.
అక్టోబర్ 21 (బుధవారం) - దసరా తర్వాతిరోజు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అధికారిక సెలవు ఉంది.
తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగులకు సెలవులు
అక్టోబర్ 17 (శనివారం) - కార్పోరేట్, ఐటీ ఉద్యోగులకు ప్రతి వీకెండ్ రెండ్రోజుల సెలవులు ఉంటాయి. వీరికి దసరా పండక్కి ముందు శనివారం హాలిడే ఉంది.
అక్టోబర్ 18 (ఆదివారం) - సద్దుల బతుకమ్మకి ప్రైవేట్ ఉద్యోగులకు సెలవు ఉండదు. కానీ ఈసారి బతుకమ్మ పండగ ఆదివారం వస్తోంది... కాబట్టి వీకెండ్ సెలవు కలిసివస్తోంది.
అక్టోబర్ 20 (మంగళవారం) - దసరా పండక్కి ప్రైవేట్ ఉద్యోగులకు కూడా సెలవు ఉంటుంది.
మధ్యలో అక్టోబర్ 19 (సోమవారం) ఒక్కరోజు ఉద్యోగులకు వర్కింగ్ డే ఉంటుంది. ఈరోజు ఎలాగోలా మేనేజ్ చేసి లీవ్ తీసుకుంటే దసరా పండక్కి వరుసగా నాల్రోజుల సెలవులు కలిసివస్తాయి. ఎలాగూ పిల్లలకు సెలవులుంటాయి కాబట్టి పండగరోజుల్లో కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు.