కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన 17 ఏళ్ల బాలుడు.. ఎక్స్‌రే తీసి చూడగా వైద్యులు షాక్

Published : Nov 26, 2026, 05:04 PM IST

Telangana: సాధారణ కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన ఓ బాలుడికి వైద్య పరీక్షల్లో ఊహించని విషయం బయటపడింది. శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు అతడి శరీరంలో మ‌హిళ‌ల్లో ఉండే అవ‌య‌వాన్ని గుర్తించారు. ఈ వైద్య ఉదంతం విక‌రాబాద్‌లో వెలుగులోకి వ‌చ్చింది.

PREV
15
కడుపు నొప్పి, వాపుతో ఆసుపత్రికి..

వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలుడు కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. దీనికి తోడు కుడివైపు వృషణ సంచిలో వాపు రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే అతడిని పరిగిలోని ఛత్రజీ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు సమస్యకు అసలు కారణాన్ని తెలుసుకునేందుకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించారు.

25
పదేళ్ల వయసులోనూ ఇదే సమస్యతో ఆపరేషన్

బాలుడి వైద్య చరిత్రను పరిశీలించిన వైద్యులకు గతంలోనూ ఇలాంటి సమస్య ఉన్నట్లు తెలిసింది. అతడికి పదేళ్ల వయసున్నప్పుడు వృషణం కిందికి దిగకపోవడం (Undescended Testis) అనే సమస్య గుర్తించారు. దీంతో అప్పట్లో శస్త్రచికిత్స నిర్వహించినప్పటికీ వృషణం ఆచూకీ గుర్తించలేకపోయారు. తాజాగా మళ్లీ నొప్పి, వాపు రావడంతో వైద్యులు ఈ కేసును మరింత జాగ్రత్తగా పరిశీలించాలని నిర్ణయించారు.

35
శస్త్రచికిత్సలో కనిపించిన గర్భాశయం

బాలుడికి వైద్యులు లోతైన శస్త్రచికిత్స నిర్వహించి అంతర్గత అవయవాలను పరిశీలించారు. ఈ క్రమంలో పురుషుడి శరీర నిర్మాణంలో సాధారణంగా కనిపించని గర్భాశయం (Uterus) వంటి అవయవం ఉన్నట్లు గుర్తించారు. దీంతో వైద్య బృందం ఆశ్చర్యానికి గురైంది. సాధారణంగా పురుషుల్లో ఉండని స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన అవయవాలు బాలుడి శరీరంలో ఉండటం ఈ కేసులో ప్రత్యేకతగా నిలిచింది.

45
ఈ పరిస్థితిని ఏమంటారు.?

వైద్య పరిభాషలో ఈ పరిస్థితిని 'పర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్' (Persistent Mullerian Duct Syndrome) అంటారు. ఇది అరుదైన జన్యుపరమైన సమస్య. సాధారణంగా పురుష శిశువు అభివృద్ధి చెందే సమయంలో ముల్లెరియన్ నాళాలు అంతరించిపోవాలి. అయితే ఈ సమస్య ఉన్నవారిలో అవి పూర్తిగా అంతరించకపోవడంతో గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్స్ వంటి స్త్రీ పునరుత్పత్తి అవయవాలు శరీరం లోపల ఉండిపోవచ్చు. బయటకు పురుషుడి శారీరక లక్షణాలే కనిపించినప్పటికీ, అంతర్గతంగా ఈ అవయవాలు ఉండటం దీని ప్రత్యేకత. వృషణాలు కిందికి దిగకపోవడం కూడా ఈ సమస్యతో సంబంధం కలిగి ఉండవచ్చు.

55
విజయవంతంగా శస్త్రచికిత్స.. కోలుకుంటున్న బాలుడు

ఇది సంక్లిష్టమైన వైద్య కేసు కావడంతో వైద్యులు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్స అనంతరం కోలుకుంటున్నాడని ఛత్రజీ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. అరుదైన జన్యుపరమైన సమస్య కారణంగా వెలుగుచూసిన ఈ ఉదంతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories