ఎన్నికలపై చంద్రబాబు: తెలంగాణలో నాడు అలా, నేడు ఏపీలో ఇలా...

First Published Apr 2, 2021, 5:30 PM IST

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది. అయితే ఈ ఎన్నికల కమిషన్ తీసుకొన్న నిర్ణయాన్ని తప్పుబడుతూ టీడీపీ ఈ నిర్ణయం తీసుకొంది.ఈ విషయాన్ని చంద్రబాబునాయుడు ప్రకటించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తీసుకొన్న నిర్ణయానికి భిన్నంగా టీడీపీ ఈ ఎన్నికల విషయంలో నిర్ణయం తీసుకొంది.
undefined
2014 జూన్ 2 వతేదీన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విభజన జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటం కారణంగా అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించింది.
undefined
2009 నుండి 2014 వరకు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ సాధన కోసం పెద్ద ఎత్తున పోరాటాలు సాగాయి.
undefined
2009 ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ఎస్ , సీపీఐ, సీపీఎం మహాకూటమిగా పోటీ చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చింది. టీడీపీ వరుసగా రెండోసారి అధికారానికి దూరమైంది.
undefined
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తెలంగాణ సాధన కోసం సాగిన ఉద్యమంలో పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు. టీడీపీ నుండి కీలక నేతలు టీఆర్ఎస్ లో చేరారు.
undefined
2009 ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ అసెంబ్లీ స్థానం నుండి పోచారం శ్రీనివాస్ రెడ్డి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించాడు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఆయన టీడీపీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ లో చేరారు.
undefined
బాన్సువాడ అసెంబ్లీ స్థానానికి 2011 చివర్లో ఎన్నికలు జరిగాయి. తెలంగాణ సెంటిమెంట్ ను దృష్టిలో ఉంచుకొని ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిని బరిలోకి దింపొద్దని అప్పటి టీడీపీకి చెందిన తెలంగాణ నేతలు చంద్రబాబును ఒప్పించారు. తెలంగాణ నేతల సూచన మేరకు ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిని బరిలోకి దింపలేదు ఆ పార్టీ.
undefined
2011 అక్టోబర్ 17వ తేదీన బాన్సువాడ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాత్రం తన అభ్యర్ధిని బరిలోకి దింపింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు దక్కాయి. కానీ 2011 ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ గణనీయమైన ఓట్లను దక్కించుకొంది.
undefined
కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీనివాస్ గౌడ్ కు 33, 356 ఓట్లు దక్కాయి. 2009 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే 2.05 శాతం ఓట్లు ఎక్కువ దక్కించుకొంది.ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున తెలంగాణకు చెందిన నేతలతో చంద్రబాబు ఓ విషయాన్ని స్పష్టం చేశారు. తెలంగాణతో పాటు ఏపీలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా పోటీ చేయాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసింది.
undefined
ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది.
undefined
ఎన్నికల సంఘం వ్యవహరశైలిని తప్పుబడుతూ ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే విషయమై కూడ కొందరు పార్టీ నేతలు పొలిట్ బ్యూరో సమావేశంలో వ్యక్తం చేశారు.
undefined
తమిళనాడులో డీఎంకె అధికారంలో ఉన్న సమయంలో ఎన్నికల్లో పోటీకి జయలలిత దూరంగా ఉన్న విషయాన్ని కొందరు టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. కానీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలో అన్నాడిఎంకె అధికారంలోకి వచ్చింది. వరుసగా ఆ పార్టీ రెండు దఫాలు అధికారాన్ని చేపట్టింది.
undefined
click me!