హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి మళ్ళీ మొదలయ్యింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇటీవల సీఎం కేసీఆర్ అల్లుడు, ఎమ్మెల్సీ కవిత భర్త కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఎమ్మెల్సీ కవిత కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.
కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని.. ప్రజలు ఎవరు కూడా భయపడకూడదని సంతోష్ కుమార్ సూచించారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వలన ఎలాంటి ప్రమాదం ఉండదని ఆయన ధైర్యం చెప్పారు.
ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ వెంట నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్, సూపరిండెంటెంట్ డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ గంగాధర్, డాక్టర్ రమేష్ తదితరులు ఉన్నారు.