సూర్యుడి చుట్టూ ఇంద్రధనుస్సు.. ఆకాశంలో ఆవిష్కృతమైన అద్భుతం !

First Published Jun 2, 2021, 1:45 PM IST

ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమయ్యింది. సూర్యుడి చుట్టూ రంగుల ఇంద్రధనుస్సు లాంటి వలయం ఏర్పడింది. ఉదయం 11 గంటల నుంచి గంట పాటు ఈ దృశ్యం హైదరాబాద్ వాసులను అబ్బురపరిచింది. 

ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమయ్యింది. సూర్యుడి చుట్టూ రంగుల ఇంద్రధనుస్సు లాంటి వలయం ఏర్పడింది. ఉదయం 11 గంటల నుంచి గంట పాటు ఈ దృశ్యం హైదరాబాద్ వాసులను అబ్బురపరిచింది.
undefined
ఈ దృశ్యాన్ని చూడడానికి నగరంలో జనం తమ టెర్రస్ ల మీదికి ఎక్కి మరీ ఫోటోలు తీశారు. ఇది చూడడానికి జనం నగరంలోని పలుచోట్ల గుమిగూడారు. హైదరాబాద్ తో పాటు తాండూరు తదితర ప్రాంతాల్లోనూ వలయాకార దృశ్యాలు కంటపడ్డాయి.
undefined
గత నెలలో ఇలాంటి దృశ్యం బెంగళూరులో కూడా దర్శనమిచ్చింది. అప్పట్లో ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ కూడా అయ్యాయి. దీన్ని సన్ హాలో అని కూడా అంటారు. సూర్యుడి చుట్టూ కానీ, చంద్రుడి చుట్టూ కానీ ఇలా వలయాకారం మంచుబిందువుల వల్ల ఏర్పడుతుందని అంటున్నారు.
undefined
అయితే సూర్యుడు చుట్టూ వలయాకారం ఏర్పడటం అశుభమంటూ కొన్ని పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఈ పుకార్లను నమ్మొద్దని బిర్లా ప్లానిటోరియం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సైంటిఫిక్ పరిభాషలో వీటిని ‘22-డిగ్రీ హాలోస్’ అని పిలుస్తారని తెలిపారు.
undefined
ఎందుకంటే ఒక ప్రదేశంలో ఒక పరిశీలకునికి సూర్యుడు లేదా చంద్రుని చుట్టూ ఏర్పడ్డ రింగ్ సుమారు 22 డిగ్రీల వ్యాసార్థం ఉంటుందన్నారు. అయితే ఇది వర్షాకాలం ముందు ఆకాశంలో ఏర్పడే అతి సాధారణ విషయం అని సైంటిస్టులు చెబుతున్నారు.
undefined
ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కూడా కావడంతో ఈ సంఘటన మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. సిద్దిపేట కొత్త కలక్టరేట్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన 60 ఫీట్ల జాతీయ జెండా రాష్ట్ర ఆవిర్భావ వేళ ఇంద్రధనస్సు లోగిల్లో కమ్ముకుని కొత్త శోభ ను సంతరించుకుంది.నూతన కలెక్టరేట్ పరిశీలించడానికి వచ్చిన మంత్రి హరీష్ రావు , జిల్లా కలెక్టర్ గారు ఆ సన్నివేశాన్ని తిలికించి ఆనందించారు.
undefined
click me!