మెట్రో రైలు తనిఖీ చేసిన సీఎస్ సోమేష్ కుమార్.. టైమింగ్స్ లో మార్పులు..

First Published May 31, 2021, 4:28 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సోమవారం ఉదయం లాక్ డౌన్ సడలింపు సమయంలో మెట్రో స్టేషన్లలో...మెట్రో రైలు సర్వీసు ఏర్పాట్లు, కోవిడ్ 19 ప్రోటోకాల్లను పరిశీలించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సోమవారం ఉదయం లాక్ డౌన్ సడలింపు సమయంలో మెట్రో స్టేషన్లలో...మెట్రో రైలు సర్వీసు ఏర్పాట్లు, కోవిడ్ 19 ప్రోటోకాల్లను పరిశీలించారు.
undefined
హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండి ఎన్‌విఎస్ రెడ్డి, ఎల్ అండ్ టిఎంఆర్‌హెచ్ఎల్ ఎండి కెవిబి రెడ్డితో కలిసి ఖైరతాబాద్ స్టేషన్ నుండి అమీర్‌పేట్ మెట్రో ఇంటర్‌చేంజ్ స్టేషన్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు.
undefined
ఈ ప్రయాణంలో భాగంగా సిఎస్ ప్రయాణికులతో ముచ్చటించారు. రైలు సేవలు, భద్రతా చర్యలు మొదలైన వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రయాణీకులు సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు బాగున్నాయని తెలిపారు.
undefined
కాకపోతే మెట్రో రైలు సమయాలను ఇంకాస్త పెంచాలని కోరారు. దీనివల్ల ఆఫీసులు, వ్యాపారాలు ముగిసిన తరువాత సురక్షితంగా ఇంటికి చేరుకోవడానికి వీలవుతుందని అన్నారు.
undefined
ఈ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా, మెట్రో సేవలను మరో గంట లేదా అంతకంటే ఎక్కువ పొడిగించాలని సిఎస్ ఇద్దరు ఎండిలకు సూచించారు.ఈ సూచనల ప్రకారం ఇక రెండువైపులా చివరి ట్రైన్ ఇప్పుడున్న 11.45 కాకుండా.. మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరుతుంది. రెండు గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది.
undefined
ఈ మార్పు మంగళవారం నుండి అమల్లోకి వస్తుంది. ఉదయం మెట్రో రైలు ప్రారంభ సమయంలో ఎటువంటి మార్పు లేదు. దీనిప్రకారం మొదటి రైలు టెర్మినల్ స్టేషన్ల నుండి ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది.
undefined
ఈ కోవిడ్ కష్టకాలంలో హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు అందిస్తున్న మంచి సేవలు,భద్రతా ఏర్పాట్ల గురించి సిఎస్ ఇద్దరు ఎండీలను అభినందించారు.
undefined
click me!