సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ కోరిన ఠాగూర్: టీపీసీసీకి కొత్త బాస్ ఎంపికపై ఫోకస్

First Published Jun 1, 2021, 1:53 PM IST

తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్  ఎంపిక విషయంలో మానికం ఠాగూర్ మరోసాారి కసరత్తుు మొదలుపెట్టారు. ఈ విషయమై సోనియాగాంధీతో చర్చించనున్నారు. 

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ సోనియా గాంధీ అపాయింట్ మెంట్ కోరారు. టీపీసీసీకి కొత్త బాస్ ఎంపిక విషయమై సోనియగాంధీతో ఠాగూర్ చర్చించనున్నారు.
undefined
తెలంగాణలో కొత్త పీసీసీ బాస్ ఎంపిక చేయడం కోసం ఇప్పటికే రాష్ట్రంలో పార్టీ నేతల నుండి ఠాగూర్ అభిప్రాయాలను సేకరించారు. నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియను కొనసాగించాలని జానారెడ్డి పార్టీ నాయకత్వాన్ని కోరారు. ఈ వినతి మేరకు ఈ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది.
undefined
ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో పీసీసీకి కొత్త బాస్ ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది కాంగ్రెస్ నాయకత్వం. ఈ తరుణంలో తెలంగాణకు కొత్త పీసీసీ బాస్ ఎంపిక కోసం కూడ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రయత్నాలను ప్రారంభించింది.
undefined
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ నాగార్జునసాగర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉన్న పరిస్థితులపై రిపోర్టు కాకుండా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై కూడ మరో రిపోర్టును పార్టీ నాయకత్వానికి నివేదికను సమర్పించే అవకాశం ఉంది.
undefined
మాజీ మంత్రి జీవన్ రెడ్డి పేరును పీసీసీ చీఫ్ గా ఖరారు చేశారనే ప్రచారం సాగింది. అయితే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లు కూడ పీసీసీ రేసులో ఉన్నారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే నాయకుడు ఎవరనే విషయమై కూడ జాతీయ నాయకత్వం వెతుకుతోంది.
undefined
రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడాన్ని కొందరు పార్టీ సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు బీజేపీ ఎదిగేందుకు చేస్తున్న ప్రయత్నాలను దృష్టిలో ఉంచుకొని పీసీసీకి కొత్త చీఫ్ ఎంపిక ఉండే అవకాశం ఉంది.అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కొత్త బాస్ ఎంపిక విషయంలో సామాజిక సమీకరణాలను కూడ పరిగణనలోకి తీసుకొనే అవకాశం ఉంది.
undefined
click me!