Suummer Holidays 2026 : నైరుతి రుతుపవనాలు దక్షిణాదిన విస్తరించాయి... ఉత్తరాది రాష్ట్రాలకు చేరుకోడానికి మరికొంత సమయం పడుతుంది. జూన్ 20 తర్వాతే ఉత్తరాది రాష్ట్రాలను రుతుపవనాలు తాకనున్నాయి... పంజాబ్ వంటి రాష్ట్రాలకు జూలై 8 వరకు చేరుకునే అవకాశాలున్నాయి. అంటే అప్పటివరకు వర్షాలుండవు... ఎండలే కొనసాగనున్నాయన్నమాట. ఈ క్రమంలోనే వేసవి సెలవులను పొడిగిస్తున్నారు... ఇలా పంజాబ్, హర్యానా లో జూన్ నెలంతా విద్యాసంస్థలకు సమ్మర్ హాలిడేస్ కొనసాగనున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్రాల విద్యాశాఖలు ఉత్తర్వులు జారీచేశాయి.
24
జూన్ నెలంతా సెలవులే... జూలై 1 నే స్కూల్స్ రీఓపెన్
ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలతో పాటు దేశ రాజధాని న్యూడిల్లిల్లో జూన్ నెలంతా వేసవి సెలవులు కొనసాగనున్నాయి. జూలై 1నే ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థలు తెరుచుకునేది. ఇక ఉత్తర ప్రదేశ్ లో జూన్ 15, రాజస్థాన్, బిహార్ లో జూన్ 20న స్కూళ్లు రీఓపెన్ అవుతాయి. ఇలా జూన్ నెలలో విద్యాసంస్థలకు సమ్మర్ హాలిడేస్ కొనసాగనున్నాయి.
34
తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగింపు..
తెలంగాణలో కూడా వేసవి సెలవులు పొడిగించారు. ఏప్రిల్ 24న రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నింటికి సెలవులు ప్రారంభం అయ్యాయి... మే నెలంతా కొనసాగాయి... జూన్ లో రీఓపెన్ కానున్నాయి. ఈ వారంలోనే అంటే జూన్ 11 తో సెలవులు ముగియనున్నాయి... జూన్ 12న రీఓపెన్ కావాల్సి ఉంది.
అయితే జూన్ 12న శుక్రవారం... ఈ ఒక్కరోజే స్కూళ్ళు నడిచేది. జూన్ 13న రెండో శనివారం, జూన్ 14 ఆదివారం మళ్లీ సెలవులే... తిరిగి జూన్ 15న స్కూళ్లు తెరుచుకుంటారు. అయితే ఈ ఒక్కరోజు (జూన్ 12న) కూడా సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు... ఈ నేపథ్యంలో స్కూల్ రీఓపెన్ తేదీని జూన్ 15కు మారుస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఈ వేసవి సెలవులపై కీలక ప్రకటన చేసింది. అయితే జూన్ 12న సెలవు ఇచ్చి జూలైలో వచ్చే రెండో శనివారంను వర్కింగ్ డే గా ప్రకటించారు. ఇలా ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణ విద్యార్థులకు 3 రోజులు వేసవి సెలవులు పెరిగాయి.
తెలంగాణలో మాదిరిగానే ఆంధ్ర ప్రదేశ్ లో విద్యాసంస్థలకు వేసవి సెలవులు పొడిగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ మేరకు బిజెపి ఎమ్మెల్యే, శాసనసభా పక్షనేత విష్ణుకుమార్ రాజు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎండలు కొనసాగుతున్న నేపథ్యంలో జూన్ 12న స్కూల్స్ రీఓపెన్ చేయవద్దని... జూన్ 15 లేదా 17న చేయాలని కోరారు.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వేసవి సెలవులు పొడిగించింది... కాబట్టి ఏపీలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. జూన్ 14 వరకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని... రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు యధావిధిగా జూన్ 12నే ప్రారంభం అవుతాయని విద్యాశాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు.