bandi sanjay
బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీలో మకాం వేశారు. బీఆర్ఎస్ నుండి సస్పెన్షన్ కు గురైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను పార్టీలో చేర్చుకొనే విషయమై జాతీయ నేతలతో చర్చిస్తున్నారని సమాచారం.
bandi sanjay
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మెన్ మహేశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్ ను వీడుతారని ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి ఖండిస్తున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మహేశ్వర్ రెడ్డికి ఆ పార్టీ నాయకత్వం నిన్న షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ విషయమై మల్లికార్జున ఖర్గే వద్దే తేల్చుకొంటానని ఆయన ప్రకటించారు.
brs flag
బీఆర్ఎస్ నాయకత్వంపై తిరుగుబాటు చేసిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు,. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలపై ఆ పార్టీ నాయకత్వం సస్పెన్షన్ వేటేసింది. ఈ ఇద్దరు నేతలను బీజేపీలో చేర్చుకోవాలని ఆ పార్టీ నాయకత్వం ఆసక్తిని చూపుతుంది
bandi sanjay
రెండు రోజుల క్రితం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీజేపీ నేతలు ఫోన్ చేశారు. బీజేపీ నేతలు డికే అరుణ, ఏపీ జితేందర్ రెడ్డిలు ఫోన్ చేశారు.
bandi sanjay
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో బీజేపీ నేతలు సంప్రదింపులుు జరుపుతున్నారనే ప్రచారం కూడా లేకపోలేదు. ఈ ఇద్దరు నేతలతో కాంగ్రెస్ నేతలు టచ్ లో ఉన్నారు. అయితే ఈ ఇధ్దరు నేతలు ఏ పార్టీలో చేరుతారనే విషయమై ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
bandi sanjay
రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీ పరిస్థితులు పార్టీలో చేరికలపై జాతీయ నేతలతో చర్చించేందుకు గాను బండి సంజయ్ నిన్న ఢిల్లీకి వెళ్లారు.. బీజేపీ చేరికల కమిటీ చైర్మెన్ ఈటల రాజేందర్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి చేరికల విషయమై పార్టీ అగ్రనేతలతో చర్చిస్తున్నారని సమాచారం.
bandi sanjay
తెలంగాణ రాష్ట్రంలోని ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలను తమ పార్టీలో చేర్చుకొనే విషయమై బీజేపీ అగ్రనేతలతో రాష్ట్ర నేతలు చర్చిస్తున్నారని ప్రచారం సాగుతుంది. తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఈ దిశగా బీజేపీ నాయకత్వం పావులు కదుపుతుంది.
bandi sanjay
రెండు తెలుగు రాష్ట్రాలపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి పెట్టింది. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గత వారంలో బీజేపీలో చేరారు. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిక రాజకీయంగా ఆ పార్టీకి ప్రయోజనం కల్గించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.