ఉస్మానియా యూనివర్సిటీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్... క్యాంపస్ విద్యార్థులతో ఛాయ్ తాగుతూ చర్చ

First Published Aug 29, 2021, 2:46 PM IST

ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా  క్యాంపస్ లో కాస్సేపు విద్యార్థులతో సరదాగా గడిపారు మంత్రి. 

హైదరాబాద్: ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో పలు అభివృద్ధి పనులకు క్రీడాశాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్ శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా కింద చేపడుతున్న సింథటిక్  అథ్లెటిక్ ట్రాక్, సింథటిక్ టెన్నిస్ కోర్టు, అమ్మాయిల కోసం స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.  

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. దాదాపు 13 కోట్ల రూపాయలతో ఓయూలో ఈ పనులు చేపట్టారు. యూనివర్సిటీలోని గ్రౌండ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వైస్ చాన్సలర్ రవీందర్ తో పాటు క్రీడాశాఖ, యూనివర్సిటీ అధికారులు పాల్గొన్నారు. 
 

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ యూనివర్సిటీలో కాస్సేపు సరదాగా గడిపారు. యూనివర్సిటీలో విద్యార్థులతో కలిసి ఛాయ్ తాగుతూ సౌకర్యాల గురించి ఆరా తీశారు. హాస్టల్ వద్ద ఉన్న ఛాయ్ కొట్టు ముందు విద్యార్థులతో దాదాపు గంటకు పైగా పిచ్చాపాటిగా మాట్లాడారు మంత్రి. 

వివిధ విద్యార్ధి సంఘాల నేతలతో విద్యార్థులు సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే వాటిని పరిష్కరిస్తామని మంత్రి హామీ. వీసీతో మాట్లాడిన తర్వాత విద్యార్థులు కోరిక మేరకు హాస్టల్ దగ్గరకు వచ్చి పిచ్చాపాటిగా మాట్లాడారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.  
 

ఈ సదర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఓయూ ఉద్యమాల గడ్డ అని... ఇక్కడకు రాగానే ఒళ్ళు పులకరించిపోతుందన్నారు మంత్రి. కొత్త జోనల్ విధానం కోసం ఇన్ని రోజులు ప్రభుత్వం ఆగిందని... ఇక త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. 

ఇప్పటికే అధికారిక కసరత్తులన్నీ ఒక కొలిక్కి వచ్చిందని... ఉద్యోగ నోటిఫికేషన్లను ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తుందని మంత్రి తెలిపారు. అలాగే ఓయూలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ ఇచ్చారు. 
 

srinivas goud

క్యాంపస్ లో ఛాయ్ తాగుతూ విద్యార్థులు సమస్యలను అడిగి తెలుసుకుంటున్న శ్రీనివాస్ గౌడ్. చిత్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, విద్యార్ధి సంఘ నాయకులు, విద్యార్థులు,డిప్యూటీ మేయర్ ని కూడా చూడవచ్చు.

click me!