హైదరాబాద్: కొత్తగా తెలంగాణ కాంగ్రెస్ సారథిగా నియమితులైన రేవంత్ రెడ్డి పదేపదే సొంతపార్టీ నాయకులను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో ఇంటిదొంగలు వున్నారంటూ అతడు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. గతంలో కౌశిక్ రెడ్డి వ్యవహారంలో ఇలాంటి వ్యాఖ్యలే చేసిన రేవంత్ తాజాగా మరోసారి ఇంటిదొంగలున్నారని అన్నారు.