ఈ వ్యూహం మనకు అర్థం కావాలంటే... 2019 ఎన్నికల ఫలితాలను మనం ఒకసారి పరిశీలించాలి. ఆ ఎన్నికల్లో వైసీపీ అఖండ మెజారిటీతో అపూర్వ విజయాన్ని సాధించింది. రాయలసీమలో అయితే మూడు స్థానాలు మినహా మిగతావన్నీ స్వీప్ చేసింది. రాయలసీమలో టీడీపీ నుండి గెలిచింది చంద్రబాబు నాయుడు, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ మాత్రమే. జేసీ సోదరులు, పరిటాల కుటుంబీకులు వంటి రాజకీయ ఉద్దండులే జగన్ ఫ్యాన్ గాలిలో కొట్టుకుపోయారు.
ఈ విషయమై చంద్రబాబు నివాసంలో రేవంత్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. రంగారెడ్డి జిల్లా నేతలు మల్లారెడ్డిని రంగంలోకి దింపి తనను మల్కాజిగిరి నుండి పోటీ చేుయకుండా అడ్డుకొన్నారని రేవంత్ భావిస్తున్నారు.