సోనూ సూద్.. ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. విలన్ గా బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో మాత్రమే ప్రేక్షకులకు పరిచయం అయిన Sonu Sood కరోనా మహమ్మారి సమయంలో తనలోని హీరోయిజాన్ని చూపించాడు. తను వేసే పాత్రలు విలన్ అయినా, తాను real hero అని నిరూపించుకున్నాడు. అనేక సేవా కార్యక్రమాలు.. covod-19 మహమ్మారి ప్రభావంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ఎంతో మంది వలసకార్మికులకు, ఆపన్నులకు, సహాయార్థులకు అండగా నిలిచి యావత్ దేశ ప్రజలతో హీరోగా కొనియాడబడుతున్నారు.