దూకుడు పెంచిన కాంగ్రెస్, డిక్లరేషన్లపై ఫోకస్: సెప్టెంబర్ లో మేనిఫెస్టో విడుదల

First Published | Aug 19, 2023, 5:20 PM IST

కాంగ్రెస్ పార్టీ  దూకుడును పెంచింది.  ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే  వ్యూహాలను రచిస్తుంది. సెప్టెంబర్ మొదటి వారంలోపుగా డిక్లరేషన్లను పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.

sonia gandhi

ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనుంది.  అయితే మేనిఫెస్టో విడుదలకు ముందే పలు అంశాలపై  డిక్లరేషన్లను  కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది.  ఈ ఏడాది  చివర్లో జరిగే  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమౌతుంది. ఇప్పటికే  వరంగల్ డిక్లరేషన్ ద్వారా  కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ ను  ప్రకటించింది.  నిరుద్యోగులకు ఏం చేయనున్నామో యూత్ డిక్లరేషన్ ద్వారా  ఆ పార్టీ ప్రకటించింది.  మిగిలిన అంశాలపై  కూడ డిక్లరేషన్లపై కాంగ్రెస్ పార్టీ కేంద్రీకరించింది.

ఈ నెల  26వ తేదీన చేవేళ్లలో  కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను నిర్వహిస్తుంది.ఈ సభలో ఎఐసీసీ  చీఫ్ మల్లికార్జున ఖర్గే పాల్గొంటారు. ఈ సభలో ఎస్సీ డిక్లరేషన్ ను  ప్రకటించనుంది ఆ పార్టీ.  ఈ డిక్లరేషన్ కు  సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క తుది మెరుగులు దిద్దుతున్నారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితులకు ఏం చేయనున్నారో  ప్రస్తావించనున్నారు.


బీఆర్ఎస్ సర్కార్ ఇప్పటికే దళిత బంధు పథకాన్ని తీసుకు వచ్చింది.  ఈ పథకానికి ధీటుగా  హామీలను  డిక్లరేషన్లలో  పొందుపర్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి..ఆగస్టు  29వ తేదీన మైనార్టీ డిక్లరేషన్ ను కాంగ్రెస్ పార్టీ  ప్రకటించనుంది.  మైనార్టీలకు అమలు చేయనున్న పథకాలు, రిజర్వేషన్ల వంటి అంశాలను  కూడ  ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ మేరకు వరంగల్ లో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  మైనార్టీ డిక్లరేషన్ ను ప్రకటించనుంది కాంగ్రెస్. 
 

Siddaramaiah

ఈ ఏడాది సెప్టెంబర్  మొదటి వారంలో  ఓబీసీ డిక్లరేషన్ ను  కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుంది.  సెప్టెంబర్ ఆరు నుండి 9వ తేదీల మధ్య  ఓబీసీ డిక్లరేషన్లను  ప్రకటించనున్నారు. ఓబీసీ డిక్లరేషన్ ప్రకటించే సభకు  రాహుల్ గాంధీతో పాటు  కర్ణాటక సీఎం సిద్దరామయ్య సమక్షంలో డిక్లరేషన్ ను విడుదల చేయాలని భావిస్తున్నారు.

priyanka gandhi

మహిళా డిక్లరేషన్ ను  ప్రియాంకగాంధీ చేతుల మీదుగా విడుదల చేసే అవకాశ ఉంది. సెప్టెంబర మాసంలోనే  ఈ డిక్లరేషన్ ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశం లేకపోలేదు.  అన్ని డిక్లరేషన్లు పూర్తైన తర్వాత   సెప్టెంబర్ మాసంలోనే  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను  విడుదల చేయనుంది.  ఈ మేనిఫెస్టోను  సోనియా గాంధీ విడుదల చేయనున్నారు.సెప్టెంబర్  17న  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.  

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్  17న  మేనిఫెస్టోను విడుదల చేయాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తుంది. మేనిఫెస్టో విడుదలకు ముందే అన్ని డిక్లరేషన్లను పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.  డిక్లరేషన్లలో  పొందచుపర్చిన అంశాలు  మేనిఫెస్టోలో  ఉంటాయి.  మేనిఫెస్టోలో  చేర్చిన అంశాలను అమలు చేయకపోతే నిలదీయాలని కూడ  కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. ఈ హామీలను అమలు చేస్తామని కూడ కాంగ్రెస్ నేతలు హామీలు ఇస్తున్నారు. 

తెలంగాణపై  కాంగ్రెస్ అగ్ర నాయకత్వం కేంద్రీకరించింది.  రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు  తెలంగాణలో పార్టీ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.  పార్టీలో చేరికల అంశంపై  ఎన్నికల వ్యూహాకర్తల సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచిస్తున్నారు.మరోవైపు సోనియా గాంధీ కూడ తెలంగాణపై  పరిణామాలను పరిశీలిస్తున్నారు.ఈ ఏడాది జూలై  4న  ఖమ్మంలో జరిగిన  రాహుల్ గాంధీ సభ గురించి సోనియా గాంధీ ఎప్పటికప్పుడు  అడిగి తెలుసుకున్నారు

Rahul Gandhi, Sonia Gandhi, Bharath jodo, Shoe lace, Congress campign,

కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్ర నాయకత్వం తెలంగాణపై  మరింత ఫోకస్ పెట్టింది.  అభ్యర్థుల ఎంపిక కోసం  కసరత్తులను  కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికే ప్రారంభించింది.    స్క్రీనింగ్ కమిటీ  తన పనిని ప్రారంభించింది.  టిక్కెట్ల కోసం ఆశావాహుల నుండి ధరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను నిన్నటి నుండే ప్రారంభించారు.  తెలంగాణలో  విస్తతంగా  పర్యటించేందుకు  సిద్దంగా ఉన్నామని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తెలంగాణ నేతలకు  హామీలు ఇచ్చారు.  
 

Latest Videos

click me!