హైదరాబాద్ లో బెగ్గింగ్ రాకెట్, 29మంది యాచకులు అరెస్ట్... వృద్ధులకు రోజుకు 200 కూలీ…

First Published | Aug 19, 2023, 6:56 AM IST

హైదరాబాదులో ఓ బెగ్గింగ్ రాకెట్ గుట్టు రట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 29 మంది  బిక్షగాళ్ళను అరెస్టు చేశారు. వీరిలో  మాఫియా నిర్వాహకుడు అనిల్ పవార్ కూడా ఉన్నాడు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో బెగ్గింగ్ మాఫియా రెచ్చిపోతుంది. ఈ మాఫియా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు చేదించారు. 

రోడ్డుమీదికి వెళితే చాలు…కూడళ్లలో, బస్ స్టాప్ లో.. సిగ్నల్స్ పడిన దగ్గర.. దీనంగా చేతులు చాస్తూ వయసు పైబడిన వృద్ధులు ధర్మం కోసం వెంట పడడం కనిపిస్తుంది. ఒకసారి,  రెండుసార్లు… వేసినా.. పదేపదే వెంటపడుతూ..చివరికి చిరాకు తెప్పిస్తుంటారు.


అయితే ఇదంతా బెగ్గింగ్ మాఫియాగా టాస్క్ఫోర్స్ సిబ్బంది  తేల్చేసింది.  హైదరాబాదులోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ దగ్గర ఈ మాఫియాకు సంబంధించిన 29 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 

అరెస్ట్ చేసిన 29 మంది యాచకుల్లో బెగ్గింగ్ మాఫియా నిర్వాహకుడు అనిల్ పవార్ కూడా ఉండడం గమనార్హం.అరెస్టు చేసిన 29 మందిని రెస్కూ హోమ్ కు పోలీసులు తరలించారు. 

బిక్షాటన నిరోధక చట్టం కింద నిర్వాహకుడు అనిల్ పవార్ పై కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు.జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అనిల్ పవర్ ను అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.

ఈ బేకింగ్ మాఫియాకు సంబంధించి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ విధంగా  వివరాలు తెలిపారు.. వివిధ ప్రాంతాల నుంచి అనిల్  పవర్ వృద్ధులను తీసుకువచ్చి జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్, పరిసర ప్రాంతాల్లో  వారితో భిక్షాటన చేయిస్తున్నాడు. 

వీరందరూ భిక్షాటన చేసి సంపాదించి రోజుకు 4,500 - 6,000వరకు వసూలు చేస్తాడు. దీనికి ప్రతిగా ప్రతి ఒక్కరికి రోజుకు రూ.200 చొప్పున కూలి ఇస్తుంటాడు. ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చిందంటే.. కొంతమంది యాచకులకు సిగ్నల్స్ దగ్గర భిక్షాటన చేసే సమయంలో ఇబ్బందులకు గురయ్యారు. 

వారు  పోలీసులను ఆశ్రయించారు… ఈ నేపథ్యంలోనే పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అలా బెగ్గింగ్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఇలా యాచకుల కోసం డ్రైవ్ ని మరికొద్ది రోజులపాటు కొనసాగిస్తామని చెబుతున్నారు పోలీసులు. 

Latest Videos

click me!