నాగార్జున సాగర్ నుండి పోటీకి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆసక్తి: మామ కోసం అల్లు అర్జున్ ప్రచారం?

First Published | Aug 19, 2023, 1:59 PM IST

నాగార్జున సాగర్ అసెంబ్లీ  స్థానం నుండి పోటీకి  అల్లు అర్జున మామ  కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆసక్తిగా ఉన్నారు.  తనకు టిక్కెట్టిస్తే  అల్లు అర్జున్ ప్రచారం చేస్తారని  చంద్రశేఖర్ రెడ్డి  చెబుతున్నారు.

నాగార్జున సాగర్ నుండి పోటీకి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆసక్తి: మామ కోసం అల్లు అర్జున్ ప్రచారం?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని  నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో  సినీ నటుడు  అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేసేందుకు  రంగం సిద్దం చేసుకుంటున్నారు.  గత కొంత కాలంగా  కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి   నాగార్జున సాగర్  అసెంబ్లీ  నియోజకవర్గంలో  సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో  ఫంక్షన్ హాల్ ను కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. ఈ ఫంక్షన్ హల్ ప్రారంభోత్సవానికి సినీ  నటుడు  అల్లు అర్జున్  హాజరు కానున్నారు.

నాగార్జున సాగర్ నుండి పోటీకి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆసక్తి: మామ కోసం అల్లు అర్జున్ ప్రచారం?

అయితే  వచ్చే ఎన్నికల్లో  నాగార్జున సాగర్  అసెంబ్లీ స్థానం నుండి పోటీ  చేయాలని కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. ఈ నియోజకవర్గంలోని   పెద్దవూర మండలం చింతపల్లి గ్రామం కంచర్ల చంద్రశేఖర్ రెడ్డిది. దీంతో  నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయాలని  కూడ చంద్రశేఖర్ రెడ్డి ఆసక్తిని చూపుతున్నారు.  నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానం నోముల భగత్  సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్ ను కాదని  చంద్రశేఖర్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకత్వం టిక్కెట్టు ఇస్తుందా అనే చర్చ కూడ ఉంది.

నాగార్జున సాగర్ నుండి పోటీకి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆసక్తి: మామ కోసం అల్లు అర్జున్ ప్రచారం?

మరో వైపు  ఎమ్మెల్సీ  ఎంసీ కోటిరెడ్డి కూడ  ఈ స్థానం నుండి  బీఆర్ఎస్ టిక్కెట్టు ఆశిస్తున్నారు. నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక సమయంలోనే ఎంసీ కోటిరెడ్డి  టిక్కెట్టు ఆశించారు. కానీ ఆ సమయంలో కోటిరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని  కేసీఆర్ హామీ ఇచ్చారు.  నోముల భగత్   విజయం కోసం సహకరించాలని కేసీఆర్  కోటిరెడ్డికి సూచించారు.  నోముల భగత్ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు.  ఎంసీ కోటిరెడ్డికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు సీఎం కేసీఆర్.

నాగార్జున సాగర్ నుండి పోటీకి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆసక్తి: మామ కోసం అల్లు అర్జున్ ప్రచారం?

ప్రస్తుతం  నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో  కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడ  కార్యక్రమాలను  చేపట్టారు.   నాగార్జునసాగర్ నుండి బీఆర్ఎస్ నాయకత్వం టిక్కెట్టు ఇవ్వాలని కోరుతున్నారు. తనకు  పార్టీ నాయకత్వం టిక్కెట్టు ఇస్తే  అల్లు అర్జున్ తనకు మద్దతుగా ప్రచారం చేస్తారని  కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించారు.

మరో వైపు  తన స్వంత నియోజకవర్గమైన నాగార్జునసాగర్ పై కేంద్రీకరించారు. పార్టీ నాయకత్వం తనకు  టిక్కెట్టును కేటాయిస్తే  తన విజయం కోసం  అల్లు అర్జున్  ప్రచారం చేస్తారని  కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ధీమాగా చెబుతున్నారు.  అయితే  బీఆర్ఎస్ నాయకత్వం  కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి నాగార్జున సాగర్ టిక్కెట్టు ఇస్తుందా అనేది  ప్రస్తుతం  చర్చగా మారింది.

నాగార్జున సాగర్ నుండి పోటీకి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆసక్తి: మామ కోసం అల్లు అర్జున్ ప్రచారం?

మరో వైపు  తన స్వంత నియోజకవర్గమైన నాగార్జునసాగర్ పై కేంద్రీకరించారు. పార్టీ నాయకత్వం తనకు  టిక్కెట్టును కేటాయిస్తే  తన విజయం కోసం  అల్లు అర్జున్  ప్రచారం చేస్తారని  కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ధీమాగా చెబుతున్నారు.  అయితే  బీఆర్ఎస్ నాయకత్వం  కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి నాగార్జున సాగర్ టిక్కెట్టు ఇస్తుందా అనేది  ప్రస్తుతం  చర్చగా మారింది. ఇవాళ ఫంక్షన్ హాల్ కార్యక్రమానికి  అల్లు అర్జున్ అభిమానులు కూడ భారీగా వచ్చారు. రాజకీయ భవిష్యత్తు కార్యాచరణలో భాగంగానే  చంద్రశేఖర్ రెడ్డి అడుగులు వేస్తున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.

Latest Videos

click me!