మంత్రి సత్యవతి రాథోడ్ మానవత్వం.. ముగ్గురు చిన్నారుల తల్లికి పునరావాసం..

First Published May 19, 2021, 4:38 PM IST

భర్త చనిపోయి.. కరోనాతో పనులు లేక.. ముగ్గురు చిన్నారులను పోషించలేక అవస్థ పడుతున్న ఓ నిరుపేద మహిళకు మంత్రి సత్యవతి రాథోడ్ పునరావాసం కల్పించారు. ఆమె భర్త చనిపోయారు..బతుకు భారం అయింది...ఉన్న ముగ్గురు చిన్న పిల్లల బాగోగులు చూసుకోలేని పేదరికం..మూలిగే నక్కమీద తాటికాయపడ్డట్టు కరోనా మహమ్మారి వల్ల కుటుంబం కడుపునింపుకునే కాస్తా అదరువు కూడా కరువైంది. 

undefined
ఫలితంగా బస్టాండ్లోనే ఎప్పుడో ఒకప్పుడు దొరికే అన్నం పొట్లం ఆ ముగ్గురు పిల్లల కడుపు నింపడానికే సరిపోవడం లేదు. తల్లికి ఉపవాసాలు తప్పడం లేదు. ఇది జోగిపేట, ధాకూర్ కి చెందిన పద్మ దైన్య స్థితి.
undefined
ఇది తెలుసుకున్న రాష్ట్ర గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ కరిగిపోయారు. కంటనీరు పెట్టారు. అమ్మ మనసు మథనపడింది. వెంటనే ఆ తల్లి, పిల్లలను చేరదీయాలని, అండగా నిలవాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు.
undefined
మంత్రి ఆదేశాలు వచ్చిన వెంటనే హుటాహుటిన తరలిన మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు పద్మ పరిస్థితిని చూసి చలించి పోయారు. వెంటనే ఆ పిల్లలను అక్కున చేర్చుకున్నారు. వారు బలహీనంగా ఉండడంతో కరోనా పరీక్షలు చేయించారు.
undefined
కరోనా నెగెటివ్ రావడంతో వెంటనే చిన్న పిల్లల కోసం ఇటీవల మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రాన్సిట్ ప్రత్యేక వాహనంలో ఆమె స్వగ్రామం జోగిపేట, డాకూర్ కు చేర్చారు.
undefined
కావాల్సిన నిత్యావసర సరుకులు, పిల్లలకు ఇచ్చే అంగన్ వాడీ పోషకాహారం అందించారు. అనంతరం గ్రామ సర్పంచ్ తో మాట్లాడి ఆమె సంరక్షణ బాధ్యతలు అప్పగించారు. అంగన్ వాడీ కేంద్ర పర్యవేక్షణలో వారికి కావల్సిన సంరక్షణ చేపడుతున్నారు. సరైన సమయంలో సరైన విధంగా స్పందించి చేయుతనందించిన మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను, సర్పంచ్ ను మంత్రి అభినందించారు
undefined
click me!