Free Bus for Men's : తెలుగు మహిళలకే కాదు పురుషులకు కూడా ఫ్రీ బస్.. ప్రభుత్వం కీలక ప్రకటన

Published : Oct 02, 2026, 01:04 PM ISTUpdated : Oct 02, 2026, 01:22 PM IST

Free Bus : తెలుగు మహిళల మాదిరిగానే కొందరు పురుషులు కూడా ఆర్టిసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చట. ఈ మేరకు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు.

PREV
15
పురుషులకూ ఫ్రీ బస్ పథకం

Free Bus Scheme : తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే మహిళలు, బాలికలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అందుబాటులో ఉంది. తెలంగాణలో మహాలక్ష్మి, ఆంధ్ర ప్రదేశ్ లో స్త్రీ శక్తి పేరిట ఈ ఉచిత బస్సు పథకాన్ని అమలుచేస్తున్నాయి ప్రభుత్వాలు. అయితే తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి మహిళల మాదిరిగానే రాష్ట్రంలోని వృద్ధులు, సీనియర్ సిటిజన్లకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించే అంశం తెరపైకి తెచ్చింది.

అక్టోబర్ 1న (గురువారం) ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా ఉచిత బస్ పాసులు జారీ చేసే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని వెల్లడించారు. దీంతో ఈ పథకం అమల్లోకి వస్తే అర్హత కలిగిన వృద్ధులు టికెట్ ఛార్జీ చెల్లించకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం కలగనుంది. అయితే ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలోనే ఉంది. పూర్తి నిబంధనలు, అర్హతలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.

25
తెలంగాణ రవాణామంత్రి కీలక ప్రకటన

అక్టోబర్ 1న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు సామాజిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఇదే సందర్భంగా సీనియర్ సిటిజన్ల కోసం ఉచిత బస్ పాస్‌ల అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు.

వృద్ధుల ప్రయాణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఉచిత బస్ పాస్ వ్యవస్థను తీసుకురావడంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందించిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. త్వరలోనే అర్హత గల ప్రతి సీనియర్ సిటిజన్ కు ఆర్టిసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం వస్తుందన్నమాట... అంటే పురుషులు కూడా ఉచితంగానే ప్రయాణించవచ్చు.

సీనియర్ సిటిజన్లకు ఉచిత ప్రయాణం ఎలా ఉండొచ్చు?

ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన సమాచారం ప్రకారం.. అర్హులైన సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక ఉచిత బస్ పాసులు అందించే ప్రతిపాదన ఉంది. అంటే ఈ పాస్ అందుకున్న వారు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సమయంలో సాధారణ ప్రయాణ ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేకుండా చేసే విధానాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.

అయితే ఎంత వయసు నుంచి సీనియర్ సిటిజన్‌గా పరిగణిస్తారు? అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందా? పాస్‌కు ఏ పత్రాలు అవసరం? పాస్ ఎంతకాలం చెల్లుతుంది? దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలి? వంటి అంశాలపై ఇంకా అధికారిక మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ప్రభుత్వం నిబంధనలు ప్రకటించిన తర్వాతే ఈ ప్రశ్నలకు స్పష్టత వస్తుంది.

35
మహాలక్ష్మి పథకం రికార్డులు

తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా అమలవుతోంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక సమాచారం ప్రకారం మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు రాష్ట్ర సరిహద్దుల పరిధిలో టీజీఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పథకం 2023 డిసెంబర్‌లో ప్రారంభమైంది. ప్రయాణికురాలు బస్సులో కండక్టర్‌కు ఆధార్ కార్డు చూపించి జీరో టికెట్ పొందే విధానం అమల్లో ఉంది. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం ఉండటం ఈ పథకంలోని ముఖ్యమైన అంశాల్లో ఒకటి.

మహాలక్ష్మి పథకం ప్రారంభమైన తర్వాత టీజీఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం గణనీయంగా పెరిగింది. తెలంగాణ ప్రభుత్వ గణాంకాల ప్రకారం… ఇప్పటివరకు 200 కోట్ల మందికి పైగా మహిళా ప్రయాణికులు ఈ పథకం ద్వారా బస్సుల్లో ప్రయాణించినట్లు, వారికి సుమారు రూ. 6,700 కోట్ల మేర ప్రయాణ ఖర్చు ఆదా అయ్యిందట.

45
ఇప్పుడు వృద్ధులపై దృష్టి

మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు ఉచిత ప్రయాణ సదుపాయం ఉన్న నేపథ్యంలో.. ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు కూడా ఇలాంటి ప్రయోజనం కల్పించే ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. వయసు పెరిగిన తర్వాత వైద్యం, కుటుంబ అవసరాలు, బ్యాంకు పనులు, ఇతర సామాజిక అవసరాల కోసం తరచూ ప్రయాణించాల్సి ఉంటుంది. అలాంటి వారికి ప్రజా రవాణా ఖర్చు తగ్గించడం ద్వారా ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.

అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఉచిత బస్ పాస్‌లను పరిశీలిస్తున్న దశలోనే ఉంది. కాబట్టి సీనియర్ సిటిజన్లు ఇప్పటి నుంచే ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చిందని భావించకూడదు. అధికారిక ఉత్తర్వులు, మార్గదర్శకాలు వెలువడిన తర్వాతే పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, ఎవరెవరు అర్హులు, ఏ బస్సుల్లో వర్తిస్తుంది వంటి పూర్తి వివరాలు తెలుస్తాయి.

55
సీనియర్ సిటిజన్స్ కోసం మరిన్ని సంక్షేమ చర్యలు

ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి సంబంధించిన మరికొన్ని అంశాలను కూడా ప్రభుత్వం వెల్లడించింది. ప్రతి జిల్లాలో వృద్ధుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక అధికారిని నియమించే అంశాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే రాష్ట్రంలోని 33 జిల్లాల్లో దశలవారీగా వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు సామాజిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

రాష్ట్రంలో వృద్ధుల కోసం డే కేర్ సెంటర్లు, ఆరోగ్య సహాయం, పోషకాహారం వంటి సేవలు కూడా అందుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. వృద్ధుల సమస్యలు, అత్యవసర పరిస్థితులు, నిర్లక్ష్యం లేదా సహాయం అవసరమైన సందర్భాల్లో 14567 ఎల్డర్ లైన్ ద్వారా సహాయం పొందవచ్చని అధికారులు తెలిపారు.

త్వరలో పూర్తి వివరాలు

మొత్తంగా చూస్తే.. తెలంగాణలో మహిళల తర్వాత సీనియర్ సిటిజన్లకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇది ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ప్రతిపాదన మాత్రమే. ఉచిత బస్ పాస్‌లకు సంబంధించిన వయోపరిమితి, అర్హతలు, దరఖాస్తు విధానం, బస్సుల పరిధి, పాస్ చెల్లుబాటు వంటి అంశాలపై ప్రభుత్వం అధికారికంగా నిబంధనలు ప్రకటించాల్సి ఉంది. ఆ వివరాలు వెల్లడైన తర్వాత సీనియర్ సిటిజన్లకు ఈ పథకం ద్వారా లభించే పూర్తి ప్రయోజనాలపై స్పష్టత రానుంది.

Read more Photos on
click me!

Recommended Stories