School Holidays : వచ్చే ఎనిమిది రోజుల్లో నాల్రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులే.. ఏరోజు, ఎందుకు హాలిడే?

Published : Aug 22, 2026, 09:40 AM ISTUpdated : Aug 22, 2026, 09:55 AM IST

తెలుగు విద్యార్థులు, ఉద్యోగులు ఎగిరిగంతేసే సమాచారమిది. వచ్చేవారం ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు రోజులు సెలవులున్నాయి… ఏరోజు ఎందుకు సెలవో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
వచ్చేవారం సెలవులే సెలవులు

School Holidays : ఇప్పటికే ఆగస్ట్ లో వరుస సెలవులు వచ్చాయి... ఇకపై కూడా ఈ హాలిడేస్ కొనసాగనున్నాయి. బోనాలు, స్వాతంత్య్ర దినోత్సవం, వరలక్ష్మి వ్రతం వంటి పర్వదినాలు ఆదివారంతో కలిసివచ్చాయి... దీంతో తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు ప్రతి వారం ఓ లాంగ్ వీకెండ్ వచ్చింది. ఇక ఈ నెలలో (ఆగస్ట్) కేవలం వారంరోజులే మిగిలివున్నాయి... ఇందులోనూ నాల్రోజుల సెలవులున్నాయి. కేవలం స్కూళ్లు, కాలేజీలకే కాదు ఆఫీసులకు కూడా సెలవులు రాబోతున్నాయి.. అంటే ఉద్యోగులకు కూడా పండగే అన్నమాట. మరి వచ్చేవారం ఏరోజు, ఎందుకు సెలవులు వస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

25
ఆగస్ట్ 23 సాధారణ సెలవు

సాధారణంగా ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు, కార్యాలయాలకు సాధారణ సెలవు ఉంటుంది. ఇలా రేపు (ఆగస్ట్ 23) ఆదివారమే కాబట్టి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో విద్యార్థులు, ఉద్యోగులకు సెలవు ఉంటుంది.

ఐటీ, కార్పోరేట్ కంపెనీల ఉద్యోగులకు ప్రతి వీకెండ్ రెండ్రోజులు సెలవులుంటాయి... అంటే వారికి ఇవాళ (ఆగస్ట్ 22, శనివారం) కూడా సెలవే అన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో చాలా విద్యాసంస్థలకు నేడు ప్రత్యేక సెలవు ఉంది. ఇలా విద్యార్థులు, ఉద్యోగులకు వరుసగా రెండ్రోజుల (ఆగస్ట్ 22, 23) సెలవులు వచ్చాయి.

35
ఆగస్ట్ 26న హాలిడే

వచ్చేవారం మధ్యలో మరో సెలవు వస్తోంది. ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే మిలాద్-ఉన్-నబి ఆగస్ట్ 26న అంటే బుధవారం ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అధికారిక సెలవుగా ప్రకటించింది... అంటే మధ్యలో కేవలం సోమ, మంగళవారం (ఆగస్ట్ 24,25) మాత్రమే వర్సింగ్ డేస్… తర్వాత మళ్ళీ హాలిడే. మిలాద్-ఉన్-నబి పండక్కి తెలంగాణలోని విద్యాసంస్థలతో పాటు ఉద్యోగులకు హాలిడేనే.

45
ఆగస్ట్ 28 రాఖీ పౌర్ణమి సెలవు

సోదర సోదరీమణుల ప్రేమానురాగాల పండగ రాఖీ. అన్నాచెల్లి, అక్కాతమ్ముడు... ఇలా తోబుట్టువులు ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ఈ పండగ ఉంటుంది... ఈసారి ఆగస్ట్ 28 (గురువారం) రాఖీ పౌర్ణమి వస్తోంది. ఈ పండక్కి విద్యాసంస్థలకు అధికారిక సెలవు ఉంటుంది. అయితే ఉద్యోగులకు మాత్రం శ్రావణ పూర్ణిమ, రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం... అంటే ముందస్తు అనుమతితో వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు.

55
ఆగస్ట్ 30 సాధారణ సెలవు

ఆగస్ట్ 30న ఆదివారం... ఈ నెలలో ఇదే చివరి ఆదివారం. ఇలా ఆగస్ట్ 2 ఆదివారంతో మొదలైన సెలవుల పరంపర మరో ఆదివారంతో ముగుస్తోంది. మొత్తంగా ఆగస్ట్ లో ప్రతివారం వరుస సెలవులు వచ్చాయి... లాంగ్ వీకెండ్స్ విద్యార్థులు, ఉద్యోగులను హ్యాపీ చేశాయి. వేసవి సెలవుల తర్వాత అత్యధిక హాలిడేస్ వచ్చింది ఈ నెలలోనే.

వరుసగా ఐద్రోజులు సెలవులు పొందే ఛాన్స్

ఆగస్ట్ 26 (బుధవారం) మిలాద్-ఉన్-నబి సెలవుంది. గురువారం (ఆగస్ట్ 27) ఒక్కరోజు లీవ్ పెట్టుకుని మేనేజ్ చేయగలిగితే తర్వాత మళ్లీ మూడ్రోజులు సెలవులే. ఆగస్ట్ 28న రాఖీ పౌర్ణమి (శ్రావణ పౌర్ణమి), ఆగస్ట్ 29న శనివారం, ఆగస్ట్ 30న ఆదివారం... వరుస సెలవులున్నాయి. ఇలా కావాలనుకుంటే మొత్తం ఐదు రోజుల సెలవులు పొందవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories