School Holidays : వచ్చే సోమవారం స్కూళ్లకు సెలవు ఉంటుందా?

Published : Jul 02, 2025, 05:16 PM IST

తెలుగు రాష్ట్రాల్లో ఈ వీకెండ్ లో ప్రత్యేక సెలవులు వచ్చే అవకాశాలున్నాయి. శనివారం ఆప్షనల్ హాలిడే కాగా ఆదివారం సాధారణ సెలవు… అయితే సోమవారం కూడా సెలవు వచ్చే అవకాశాలున్నయి. ఈ సెలవులు ఎందుకో తెలుసా?  

PREV
15
తెలుగు రాష్ట్రాల్లో సెలవులే సెలవులు

Holidays : వేసవి సెలవులు ముగిసాక విద్యార్థులు భారంగానే స్కూళ్లకు వెళుతున్నారు. సెలవుల్లో తెగ ఎంజాయ్ చేసి ఒక్కసారిగా స్కూల్ కి వెళ్లాల్సి రావడమే వారి బాధకు కారణం. ఈ సమయంలో వారికి కాస్త ఊరటనిచ్చేది సెలవులే.

వారంలో ఆదివారం కాకుండా మరే సెలవు వచ్చినా విద్యార్థులు ఆనందిస్తారు. అలాంటిది ఆదివారానికి మరో రెండు రోజుల సెలవులు కలిసివస్తే..? ఎగిరి గంతేయడం ఖాయం. ఇలా ఈ వారంలో కొందరు విద్యార్థులకు వరుసగా మూడ్రోజుల సెలవులు వచ్చే అవకాశాలున్నాయి.

25
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మొహర్రం వేడుకలు

ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం వచ్చే మొదటి నెల మొహర్రం... అంటే ఇది ముస్లింల న్యూఇయర్ అన్నమాట. దేశవ్యాప్తంగా ముస్లింలే కాదు హిందువులు కూడా ఈ మొహర్రం వేడుకల్లో పాల్గొంటారు... తెలుగు ప్రజలు దీన్ని పీర్ల పండగగా జరుపుకుంటారు. ముస్లింల ఆరాధ్యదైవం మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్, అతని అనుచరుల త్యాగాలకు గుర్తుగా జరుపుకుంటారు.

ఇది ముస్లింల పండగే అయినా హిందువులు కూడా మొహర్రం వేడుకల్లో పాల్గొంటారు. అందువల్లే ఈ పండగను హిందూ ముస్లింల ఐక్యతకు, మతసామరస్యానికి నిదర్శనంగా పేర్కొంటారు. తెలంగాణ పల్లెల్లో పీర్ల ఊరేగింపు పెద్ద వేడుకలా చేపడతారు... హైదరాబాద్ పాతబస్తీలో షియా ముస్లింలు మాతం నిర్వహిస్తారు.

35
మొహర్రం సెలవు ఎప్పుడు?

ఇలా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొహర్రం పండగను కులమతాలకు అతీతంగా జరుపుకుంటారు... అందుకే ప్రతిసారి ఈ వేడుకల సందర్భంగా విద్యాసంస్థలకు, ఉద్యోగులకు సెలవు ఇస్తారు. అయితే ఈసారి మొహర్రం పండగపై కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. దీంతో ఈ సెలవుపై క్లారిటీ రావడంలేదు.

45
జులై 5,6,7 మూడ్రోజులు సెలవులేనా?

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల సెలవుల క్యాలెండర్ ప్రకారం జులై 6న మొహర్రం సెలవు ఉంది. ముస్లింలు ఈ మొహర్రం ముందురోజు కూడా సంతాప దినాలు నిర్వహిస్తారు... అందువల్లే తెలుగు రాష్ట్రాల్లో జులై 5న కూడా సెలవు ప్రకటించారు. కానీ ఇది ఐచ్చిక సెలవు... అంటే ఈ శనివారం అవసరం అనుకున్నవారే సెలవును పొందవచ్చు. విద్యాసంస్థలకు సెలవు విషయంలో నిర్వహకులే నిర్ణయం తీసుకుంటారు.

అయితే ముస్లింల పండగలు నెలవంక ఆధారంగా జరుగుతాయి... కాబట్టి ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి నెలవంక కనిపించడం ఆలస్యమైన మొహర్రం తేదీ మారనుంది. ఆదివారం కాకుండా సోమవారం జరిగే అవకాశాలుంటాయి. ఒకవేళ ఇదే జరిగితే సోమవారం కూడా ఆప్షనల్ హాలిడేగా ప్రకటించనుంది ప్రభుత్వం. ఇదే జరిగితే కొందరు విద్యార్థులకు వరుసగా మూడ్రోజులు సెలవులు వస్తాయి.

అయితే అన్ని విద్యాసంస్థలకు ఈ మొహర్రం సెలవులు వర్తించవు. కేవలం జులై 6నే ప్రభుత్వ మొహర్రం సెలవుగా ప్రకటించాయి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు... ఆరోజు ఎలాగూ ఆదివారమే కాబట్టి సెలవు ఉంటుంది. 

హైదరాబాద్ పాతబస్తీ వంటి ముస్లింలు మెజారిటీ గల ప్రాంతాల్లో ఐచ్చిక సెలవులు వర్తిస్తాయి... అక్కడి విద్యార్థులు, ఉద్యోగులకు మాత్రమే మొహర్రంకి రెండు లేదా మూడ్రోజులు సెలవులు వచ్చే అవకాశాలుంటాయి.

55
జులైలో తెలంగాణోళ్లకు ఓ సెలవు ఎక్స్ట్రా

ప్రస్తుతం ఆషాడమాసం కొనసాగుతోంది... ఈ సమయంలో తెలంగాణవ్యాప్తంగా బోనాల వేడుకలు అట్టహాసంగా జరుపుకుంటారు. ఇలా తెలంగాణ పల్లెలతో పాటు రాజధాని నగరం హైదరాబాద్ లో బోనాల వేడుకలు ప్రారంభమయ్యాయి. 

గోల్కొండ బోనాలతో ప్రారంభమైన సందడి ప్రతి ఆదివారం కొనసాగుతుంది... జులై 13న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు జరుగుతాయి. ఇక జులై 20న హైదరాబాద్ నగరంమొత్తం బోనాల వేడుకలు జరుగుతాయి.

ఈ హైదరాబాద్ బోనాల సందర్భంగా కేవలం తెలంగాణ ఉద్యోగులు, విద్యార్థులకే రెండ్రోజులు వరుస సెలవులు రానున్నాయి. జులై 20 ఆదివారం అంటే బోనాల రోజు ఎలాగూ సెలవే... ఆ తర్వాతిరోజు జులై 21న కూడా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇలా జులైలో బోనాల పండక్కి వరుసగా రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి. ఏపీలో బోనాల ఉత్సవాలు ఉండవు కాబట్టి అక్కడ సెలవు లేదు.

Read more Photos on
click me!

Recommended Stories