School Holidays : ఇవాళ (అక్టోబర్ 7) తెలంగాణలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ఉంది. హటాత్తుగా ఈ సెలవు ఎందుకు ఇచ్చారు? ఏఏ జిల్లాల్లో సెలవుంది? తెలుసుకుందాం.
School Holidays : తెలంగాణ పోరాటయోధుడు కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా నేడు రాష్ట్రంలోని కొన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అక్టోబర్ 7 (మంగళవారం) కొమురం భీమ్ 85 వర్ధంతి... దీంతో ఆయన పుట్టిపెరిగిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు ప్రత్యేక సెలవు ఇచ్చారు. ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.
25
జోడేఘాట్ లో వర్ధంతి వేడుకలు
ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండలంలోని కొమురం భీమ్ స్వస్థలం జోడేఘాట్ లో ఈ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. భారీగా ప్రజలు కొమురం భీమ్ కు నివాళి అర్పించేందుకు వస్తారు... కాబట్టి రవాణా సదుపాయంతో పాటు తాగునీరు, భోజన వసతి కల్పించనున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని, వైద్య సదుపాయం కల్పించాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అధికారులను ఆదేశించారు.
35
నవంబర్ లో ఆ సెలవు రద్దు
కొమురం భీమ్ వర్దంతికి ఇవాళ సెలవు ఇచ్చి నవంబర్ లో ఓ సెలవును రద్దు చేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో నవంబర్ 8 రెండో శనివారం సెలవు వర్తించదు. కొమురం భీమ్ వర్ధంతి సెలవును నవంబర్ లో వచ్చే రెండో శనివారం సెలవుతో భర్తీ చేశారు. మొత్తంగా అక్టోబర్ 7న స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇచ్చారు.
ఇక ఈ నెలలో ఇప్పటికే దసరా సెలవు ముగిశాయి. ఇవాళ్టి (సోమవారం, అక్టోబర్ 6) నుండే పూర్తిస్థాయిలో స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఇంతలోనే కొమురం భీమ్ వర్ధంతి సెలవు వచ్చింది. మరో రెండుమూడు రోజులు గడవగానే అక్టోబర్ లో రెండో శనివారం సెలవు వస్తుంది. ఆ వెంటనే ఆదివారం. ఇలా ఈ వీకెండ్ లో మరో రెండ్రోజుల సెలవులు వస్తున్నాయి.
55
అక్టోబర్ లో వచ్చే మొత్తం సెలవులు
అక్టోబర్ 19, 20 న మరో రెండ్రోజులు వరుస సెలవులు వస్తున్నాయి. అక్టోబర్ 10 ఆదివారం మాత్రమే కాదు నరక చతుర్ధశి. ఇక అక్టోబర్ 20న దీపావళి పండగ సెలవు. కొందరు విద్యార్థులు, ఉద్యోగులకు అక్టోబర్ 18 (శనివారం) కూడా సెలవుండే అవకాశాలున్నాయి... ఎందుకంటే ఆరోజు ధన త్రయోదశి. అక్టోబర్ 26న చివరగా సండే సెలవు. మొత్తంగా ఈ అక్టోబర్ లో తొమ్మిదిపదిరోజుల సెలవులు వస్తున్నాయి.