Sankranti Holidays in Telangana
Sankranti Holidays in Telangana : సంక్రాంతి ... తెలుగోళ్ల పెద్ద పండగ. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. పిల్లలు పతంగులతో, అమ్మాయిలు ఇంటిముందు రంగురంగులు ముగ్గులతో, పెద్దలు పిండివంటలు, కోడి పందాలతో సందడి చేస్తారు. ఇక గంగిరెద్దుల ఆటలు, భోగిమంటలు వెలుగులు, బొమ్మల కొలువులతో తెలుగు పల్లెల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ఇలా తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే పండగ కాబట్టి ప్రభుత్వాలు కూడా ఈ సంక్రాంతికి ఎక్కువరోజులు సెలవు ఇస్తుంటాయి.
ఈ సంక్రాంతికి కూడా ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఏపీలో ఈ నెల (జనవరి) 10 నుండి 19వ తేదీ వరకు అంటే పదిరోజులు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. తెలంగాణలో మాత్రం కేవలం జనవరి 11 నుండి 17 వరకు అంటే ఏడు రోజులపాటు సెలవు ప్రకటించింది. కానీ కొన్ని స్కూళ్లకు ఏపీలో మాదిరిగానే తెలంగాణలోనూ పదిరోజుల సెలవులు వస్తున్నాయి. అదెలాగో చూద్దాం.
తెలంగాణలో సంక్రాంతి సెలవులపై క్లారిటీ ... ఎన్నిరోజులో తెలుసా?
తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులను ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ అన్నింటికి ఈ నెల అంటే జనవరి 11 నుండి 17 వరకు సెలవులు ఇచ్చారు. జనవరి 18న తిరిగి ప్రారంభం అవుతాయి. అయితే అకడమిక్ క్యాలెండర్ ప్రకారం 13 నుండి 17 వరకు అంటే ఐదురోజులు మాత్రమే సంక్రాంతికి సెలవు ఇవ్వనున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. కానీ జనవరి 11 రెండో శనివారం, జనవరి 12 ఆదివారం కావడంతో ఎలాగూ స్కూళ్లకు సెలవులు. కాబట్టి వీటిని కూడా సంక్రాంతి సెలవుల్లో కలిపి మొత్తం ఏడ్రోజుల సెలవులు ప్రకటించారు.
ఇక కాలేజీల విషయానికి వస్తే ఓ రోజు తక్కువగా సంక్రాంతి సెలవులు ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు కూడా జనవరి 11 నుండే సెలవులు ప్రారంభం అవుతాయి. కానీ జనవరి 16వ తేదీతో ఈ సెలవులు ముగుస్తాయి. జనవరి 17న కాలేజీలు తిరిగి ప్రారంభం అవుతాయి... అంటే వీరికి కేవలం ఆరు రోజులు మాత్రమే సంక్రాంతి సెలవులు.
ఇలా తెలంగాణలోని విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు గరిష్టంగా ఏడురోజులు ఇచ్చారు. కానీ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు స్కూళ్లకు ఏపీలో మాదిరిగానే పదిరోజులు సంక్రాంతి సెలవులు వస్తున్నాయి. ఇప్పటికే సెలవుల విషయంతో విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం కూడా వెళ్లింది. ఇలా పదిరోజుల సంక్రాంతి సెలవులు ఇస్తున్న తెలంగాణ స్కూల్స్ ఏమిటో తెలుసుకుందాం.
School Holidays
తెలంగాణలోనూ ఆ స్కూళ్లకు 10 రోజులు సంక్రాంతి సెలవులు :
తెలంగాణలో జనవరి 11 నుండి సంక్రాంతి సెలవులు ప్రారంభంకానున్నాయి. కానీ దీనికి ముందురోజు అంటే జనవరి 10న వైకుంఠ ఏకాదశి వుంది. ఈ రోజులు హిందువులు చాలా పవిత్రంగా బావిస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువు నివాసముండే వైకుంఠానికి ద్వారం తెరిచి వుంటుందని నమ్ముతారు. తిరుమల వంటి పుణ్యక్షేత్రాల్లో ఈ రోజున వైకుంఠద్వారా దర్శనం కల్పిస్తారు. ఇలా ఈ రోజు కూడా పండగలా జరుపుకుంటారు... అందువల్ల హిందూ సంస్థల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లకు జనవరి 10న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని సెలవు ప్రకటించారు.
ఇక ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రజలు హైదరాబాద్ లో ఎక్కువగా నివాసముండే ప్రాంతాలు అనేకం వున్నాయి... ఇందులో కూకట్ పల్లి, మియాపూర్, లింగంపల్లి వంటి ప్రాంతాల్లో మరీ ఎక్కువగా వుంటారు. కాబట్టి సంక్రాంతికి ఈ ప్రాంతంలోని వారు ముందుగానే స్వస్థలాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇది దృష్టిలో వుంచుకుని ఈ ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు కూడా ఓ రోజు ముందుగానే అంటే జనవరి 10 నుండి సెలవులు ఇస్తున్నారు.
ఇలా హైదరాబాద్ లోని పలు స్కూళ్లు వచ్చే గురువారం (మరో మూడ్రోజులు) వరకే నడవనున్నాయి. శుక్రవారం నుండి సంక్రాంతి సెలవులు ప్రారంభంకానున్నారు. మిగతా స్కూళ్లకు శనివారం నుండి సెలవులు ప్రారంభం అవుతాయి.
ఇక తెలంగాణలోని అన్ని స్కూళ్లు జనవరి 18న తిరిగి పున:ప్రారంభం అవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆరోజు శనివారం... హైదరాబాద్ లోని కొన్ని స్కూళ్లకు సాదారణ సెలవు వుంటుంది, ఆ తర్వాత ఆదివారం. కాబట్టి జనవరి 18, 19న కూడా స్కూళ్లకు సెలవు వస్తోంది. ఇలా తెలంగాణలోని కొన్ని స్కూళ్లకు ప్రభుత్వం ప్రకటించిన ఏడు రోజులకు మరో మూడు సెలవులు కలిసివచ్చి జనవరి 10 నుండి 19 వరకు సంక్రాంతి సెలవులు వచ్చాయి.
మిగతా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు మాత్రం ప్రభుత్వం ప్రకటించినట్లే జనవరి 11 నుండి 17 వరకు మాత్రమే సెలవులు వున్నాయి. కానీ శనివారం ఒక్కరోజు సెలవు తీసుకుంటే ఆ తర్వాత ఆదివారం సెలవు కలిసివస్తుంది. కాబట్టి ఎక్కువమంది విద్యార్థులు శనివారం స్కూళ్లు ప్రారంభమైనా జనవరి 20 నుండే స్కూల్ బాట పడతారు.
సంక్రాంతికి సగం హైదరాబాద్ ఖాళీ అవుతుంది :
హైదరాబాద్ ... ప్రస్తుతం తెలంగాణ రాజధాని. కానీ గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని. కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజలు ఎంతమంది వన్నారో ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవారు కూడా అంతే వున్నారు. ఇలా హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్ర ప్రాంత ప్రజలు సంక్రాంతికి తప్పక సొంతూళ్లుకు వెళుతుంటారు. కాబట్టి సగం హైదరాబాద్ ఖాళీ అవుతుంది.
ప్రతి ఏటా సంక్రాంతి సమయంలో హైదరాబాద్ రోడ్లు ఖాళీగా కనిపిస్తుంటారు. ఇదే సమయంలో హైదరాబాద్ నుండి ఏపీకి వెళ్లే రోడ్లు వాహనాలతో కిక్కిరిసి పోతాయి. ఇక తెలంగాణ, ఏపీల మధ్య భారీగా ఆర్టిసి, ప్రైవేట్ బస్సులు, రెగ్యులర్, స్పెషల్ రైళ్లు నడుస్తాయి. వీటన్నింటికి ఇప్పటికే టికెట్లన్ని బుక్ అయిపోయాయి అంటేనే హైదరాబాద్ నుండి ఏపీకి వెళ్లేవారు ఏ స్థాయిలో వుంటారో అర్థం చేసుకోవచ్చు.
ఇక హైదరాబాద్ లో నివాసముండే తెలంగాణ ప్రజలు కూడా సంక్రాంతి సమయంలో సొంతూళ్లకు వెళతారు. కాబట్టి హైదరాబాద్ నగరం సంక్రాంతి పండగవేళ బోసిపోయి కనిపిస్తుంది. ఇలా పండక్కి వెళ్లేవారు తిరిగి జనవరి 19న ఆదివారం నగరానికి చేరుకుంటారు. కాబట్టి మళ్లీ ఆరోజు నగరంలో వాహనాల రాకపోకలు పెరిగి రోడ్లన్ని సందడిగా మారతాయి. జనవరి 20 నుండి మళ్లీ నగరం యధావిధిగా మారిపోతుంది.
ఇవి కూడా చదవండి :
2025లో సెలవులే సెలవులు : వచ్చేవారం నుండి వరుస లాంగ్ వీకెండ్స్, ఎన్నో తెలుసా?
హైదరాబాద్ నుండి ఏపీకి సంక్రాంతి ప్రత్యేక రైళ్లు... టికెట్ బుకింగ్స్ ప్రారంభం
Sankranti Holidays : సాఫ్ట్ వేర్, బ్యాంక్ ఉద్యోగులకూ నాలుగు రోజుల సంక్రాంతి సెలవులు