కృష్ణ యాదవ్ తో బీజేపీ నేతల మంతనాలు: ఆ రెండు అసెంబ్లీ స్థానాలపై కన్ను

First Published | Jul 30, 2023, 2:43 PM IST

మాజీ మంత్రి కృష్ణ యాదవ్ తో  బీజేపీ  నేతలు సంప్రదింపులు జరుపుతున్నారనే  ప్రచారం సాగుతుంది.  

కృష్ణ యాదవ్ తో బీజేపీ నేతల మంతనాలు: ఆ రెండు అసెంబ్లీ స్థానాలపై కన్ను

హైదరాబాద్: మాజీ మంత్రి కృష్ణ యాదవ్ తో  బీజేపీకి చెందిన కీలక నేతలు టచ్ లోకి వెళ్లారు.  అయితే  టిక్కెట్టు విషయమై కృష్ణయాదవ్ బీజేపీ నాయకత్వం నుండి హామీ కోరుతున్నారని  సమాచారం.అయితే  ఈ విషయమై కృష్ణ యాదవ్ కానీ,  బీజేపీ నాయకత్వం కానీ స్పష్టత ఇవ్వలేదు.

కృష్ణ యాదవ్ తో బీజేపీ నేతల మంతనాలు: ఆ రెండు అసెంబ్లీ స్థానాలపై కన్ను

బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు  కొందరు  మాజీ మంత్రి కృష్ణయాదవ్ తో సంప్రదింపులు జరిపారని ప్రచారం సాగుతుంది. 2016లో  జనవరి  22న  కృష్ణ యాదవ్ టీడీపీని వీడీ బీఆర్ఎస్ లో చేరారు. అయితే బీఆర్ఎస్ లో కూడ  కృష్ణ యాదవ్ కు ఆశించిన గుర్తింపు దక్కలేదు. దీంతో కృష్ణయాదవ్  బీజేపీ వైపు చూస్తున్నారు.  గత కొంత కాలం క్రితం మాజీ మంత్రి ఈటల రాజేందర్  కృష్ణ యాదవ్ తో  భేటీ అయ్యారు.కానీ ఆయన  బీజేపీలో  చేరలేదు.

కృష్ణ యాదవ్ తో బీజేపీ నేతల మంతనాలు: ఆ రెండు అసెంబ్లీ స్థానాలపై కన్ను

ఈ ఏడాది  చివరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో  ఇతర పార్టీల్లోని అసంతృప్తులకు గాలం వేస్తున్నారు.  ఈ క్రమంలోనే  మాజీ మంత్రి సి. కృష్ణయాదవ్ తో బీజేపీకి చెందిన  కొందరు కీలక నేతలు టచ్ లోకి వెళ్లారని  సమాచారం.

కృష్ణ యాదవ్ తో బీజేపీ నేతల మంతనాలు: ఆ రెండు అసెంబ్లీ స్థానాలపై కన్ను

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి  కృష్ణ యాదవ్ టీడీపీ అభ్యర్ధిగా  విజయం సాధించారు. టీడీపీలో  కృష్ణ యాదవ్ కీలకంగా వ్యవహరించారు. తెలుగు యువత,  టీడీపీ హైద్రాబాద్ నగర శాఖ అధ్యక్షుడిగా కూడ ఆయన పనిచేశారు.

కృష్ణ యాదవ్ తో బీజేపీ నేతల మంతనాలు: ఆ రెండు అసెంబ్లీ స్థానాలపై కన్ను

1994  లో  హిమాయత్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి సి. కృష్ణ యాదవ్  అసెంబ్లీలో అడుగు పెట్టారు.  చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న కాలంలో  కార్మిక శాఖ మంత్రిగా  పనిచేశారు.  నకిలీ స్టాంపుల కుంభకోణంలో  కృష్ణ యాదవ్ ను మహారాష్ట్ర పోలీసులు 2003లో అరెస్టయ్యారు. అయితే కృష్ణ యాదవ్ పై  నమోదైన  కేసును కోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత 2014 ఎన్నికలకు ముందు కృష్ణ యాదవ్ టీడీపీలో చేరారు. 2016లో జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు  కృష్ణ యాదవ్ టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు.
 
కృష్ణ యాదవ్ తో బీజేపీ నేతల మంతనాలు: ఆ రెండు అసెంబ్లీ స్థానాలపై కన్ను

అయితే  బీఆర్ఎస్ లో కూడ  కృష్ణయాదవ్  అసంతృప్తితో ఉన్నారు. దీంతో  బీజేపీ నాయకత్వం  కృష్ణయాదవ్ తో టచ్ లోకి వెళ్లింది. గతంలో  కృష్ణ యాదవ్  ప్రాతినిథ్యం వహించిన  హిమాయత్ నగర్ అసెంబ్లీ స్థానం నియోజకవర్గాల  పునర్విభజనతో  అంబర్ పేట నియోజకవర్గంగా మారింది.  దీంతో  అంబర్ పేట  లేదా  మలక్ పేట అసెంబ్లీ స్థానం నుండి పోటీకి  కృష్ణ యాదవ్  ఆసక్తిని చూపుతున్నారు. అయితే  ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  

Latest Videos

click me!