ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరంగల్ నగరం అతలాకుతలమైంది . వరద నీరు పోటెత్తి కాలనీలను చుట్టుముట్టింది. వరదలో చిక్కుకున్న 50 మందిని పోలీసులు కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భగత్ సింగ్ కాలనీ, కాకతీయ యూనివర్సిటీ కళాశాల ప్రాంతాల్లో వరద చుట్టుముట్టడంతో ఇళ్లల్లో చిక్కుకుపోయిన 20 కుటుంబాలను పోలీసులు కాపాడారు.